ఆకలి రాజ్యం
దేశాలలోని ప్రజలు ఆహార
కొరతతో క్షుధ్బాదని అనుభవిస్తూ అలమటించే
ఆకలి రాజ్యాలు ఎన్నో
కారణం ఏదైనా కరువు కాటకాలతో ప్రకృతి విలయాలతో సంక్షోభాల వూబిలో ప్రజలకు శాపాలై
అందరికీ ఆహారం అనే
అందుబాటులో లేకుండాపోయింది.
గతి తప్పిన ఋతువులు
గాడి తప్పిన పర్యావరణం
పనిగట్టుకుని ప్రకృతి
విధ్వంసాలు మహమ్మారిల
విజృంభణ కొత్త కోణాలలో
మనిషి బ్రతుకు అయోమయం చేస్తూ
రెండు పూటలా తినడానికి
కష్టమవుతోంది
రాజ్యాధికార సూత్రాలు
అంచనాల తలక్రిందులు
దారిద్ర్య రేఖలు దాటలెని
తీరులో అండలేని దారులు
ఆకలితీరడాని ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
యుద్ధాల నీతులు
శరణార్థుల కేకలు
అన్నార్తుల సాహసం
పుడమితల్లి వేదన
ఆకలితో చచ్చే అభాగ్యులు
శ్రీలంక లాంటి దేశాలు
చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాయి
సంపన్న దేశాలైన
ఆకలి బాధతో సుస్తీ
లేకుండా సాగిపోవాలి
జనజీవనం తిండికోసం
కలవరపడ కుండా ……?
– జి జయ