ఆకలి కేకలు

 ఆకలి కేకలు

దేశం ఎంత అభివృద్ధి చెందుతున్న ,
ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటున్నాయి..
ఎవరో ఒకరు ఆకలితోనే చచ్చిపోతూనే ఉంటున్నారు.
అనాధలైన , అడుక్కున్న వాళ్లకేనా ,
ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.
ఎందుకు కళ్లున్నా గుడ్డిది అవుతుంది ఈ లోకం.
వీళ్ళ ఆకలి కేకలు మీకు వినిపించడం లేదా ,
చెత్త బుట్టలో ఉన్న అన్నాన్ని ఏర్కుంటూ తింటూ ,
ఆకలి కోసం పనిచేస్తాము అంటే పని ఇవ్వకుండా
బయటికి గెంటేస్తున్నారు.
ఆ ఆకలి కోసమే కొందరు దొంగలు అవుతున్నారు.
ఆకలి విలువ కాలే కడుపుకి తప్ప ,
ఇంకా ఎవరికి తెలుసు ,
ఆకలి బాధలు ఉంటే రుచిపచి తెలియవు,
ఆకలి కేకల రాజ్యంలో అన్నం కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ,
ఎండ , వాన అనకుండా ప్లాట్ ఫామ్ మీద పడుకుంటూ ,
ఆకలేసి అడుక్కుంటే దానం చేయకుండా తిడతారు.
ఆకలి భరించలేక దొంగతనం చేస్తే పట్టుకొని కొడుతారు.
ఓ రెండు రోజుల తర్వాత ఆకలితో చనిపోతే
జాలి చూపిస్తారు కానీ ,
తాను బతికున్నప్పుడు దొంగతనం చేయడం కరెక్టే అని అనుకోరు.
తాను ప్రాణాలతో ఉన్నప్పుడు అన్నం పెడితే ఇప్పుడు బ్రతికే ఉండేవాడు కదా అని అనుకోరు.
ఇవన్ని చూస్తే కనీసం మనసు కరగదా ,
ఆకలి మంటతో ప్రతిక్షణం వాళ్ళు కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు..

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *