ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు

అమృత, విలాస్ కి పెళ్లి వారం రోజులు దాటింది. ఈ వారం రోజులు ఇద్దరూ సభ్యులలో మొగ్గలైపోతూ చిలిపిగా చూసుకుంటూ పెద్దల మధ్య ఉన్నాడు. అయితే పెళ్లయిన తర్వాత వేరు కాపురం పెట్టాలి కదా పెద్దవాళ్ళు ఒక మంచి ఇల్లు చూసి వేరుగా కాపురం పెట్టించారు కొన్ని రోజులు వేరుగా ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, అనే ఉద్దేశంతో, పెద్దవాళ్ళు ఉన్న నాలుగు రోజులు చాలా బాగానే ఉన్నారు.

ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. అమృత వంట బాగానే చేస్తుంది పరవాలేదు కానీ విలాస్ కి ప్రతి దాంట్లోనూ పెరుగు వేసుకొని తినడం అలవాటు మొదటి రోజు అమృత అతని ఇష్టాన్ని తెలుసుకుని అతని ఇష్టానికి తగ్గట్టుగా ముద్దపప్పు చేసింది.

పక్కనే బంగాళాదుంప వేపుడు అలాగే నెయ్యి ఆవకాయ కూడా పెట్టింది. విలాస్ వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ముద్దపప్పు కలిపాడు. అమృత చాలా ఉత్సాహంగా చూస్తుంది ఎలా ఉందో చెప్తాడు అని ఇంతలో విలాస్ పెరుగు అని అన్నాడు అదేంటి ఇంకా మొదలే పెట్టలేదు అప్పుడే పెరుగా అంటూ ఆశ్చర్యపోయింది మళ్లీ విలాస్ పెరుగు అన్నాడు.

అదేంటండి మొదటి ముద్ద తిననేలేదు అప్పుడే పెరుగుకు వచ్చేసారు అంటూ అడిగింది అమృత విలాస్ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ పెరుగు అనడంతో సరే సరే అని పెరుగు తీసుకొచ్చి వేసింది. ఆ తర్వాత ఆవకాయలో కూడా పెరుగే వేసుకున్నాడు అది చూసి ఇంకా విత్తరపోయింది. పెరుగన్నంలో ఆవకాయలు అనుకుంటారు గానీ ఆవకాయలు పెరుగు వేసుకోవడం తనెప్పుడు చూడలేదు అలాగే బంగాళాదుంప వేపుడు పెరిగే వేసుకున్నాడు.

ఇలా ప్రతిరోజూ ఏ వంట చేసినా అందులో ఖచ్చితంగా పెరుగు ఉండాల్సిందే దాంతో విసిగిపోయిన అమృత కోర్టు వరకు వెళ్ళింది అతని ఆహారపు అలవాట్లు చాలా వింతగా ఉన్నాయి మనిషి ఇంకా ఎంత వింతగా ఉంటాడో అనుకుంటూ అతనితో తాను కాపురం చేయలేనని పెళ్లయిన విడాకుల వరకు వెళ్ళింది విషయం పెద్దలు ఎంతో నచ్చజెప్పారు.

పెరుగు లేకుండా ఉండలేడు చాలా మంచివాడు అంటూ చెప్పారు కానీ రేపు పదిమందిలో ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తే ఇలాంటి అలవాట్లు ఉంటే తనను చూసి అందరూ నవ్వుతారు అని తను అందరిలో చులకన అవుతానని భావించిన అమృత పెద్దల మాటలు వినకుండా అమృత విడాకులు తీసుకుంది. పెరుగు వల్ల వాళ్ళ పెళ్లి పెటాకులు అయింది.

ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది వారి అలవాట్లు మంచివే అయితే మంచిది అంటే అందరూ తినేలాగా కొందరు ఉంటారు మరొకరికి ప్రతికూలలో నెయ్యి వేసుకోవడం అలవాటు అది పప్పా, ఫ్రైయా అని కూడా చూడరు. అన్నిట్లో నెయ్యి వాడతారు మరికొందరికి పులిహోరలో పెరుగు వేసుకొని తినడం అలవాటు. ఇలా ఒక్కొక్కరి నాలుక ఒక్కొక్క రుచిని కోరుతుంది.

ఏనాడో చెప్పారు, పుర్రె కో బుద్ధి జిహ్వ కో రుచి అని, ఇక మనం మన ప్రాచీన అలవాట్ల విషయానికి వస్తే ప్రాచీలు తమకు దొరికే కన్నుమూలల దుంపలు తింటూ బ్రతికారు అడవిలో నుంచి వచ్చిన పనులను ఆహారంగా తీసుకున్నారు. ఆ తర్వాత పంటల గురించి తెలుసుకొని పప్పులు గానుగ నూనెలు రాగులు సజ్జలు వంటివి వాడారు పురుగులు మందులు లేని వ్యవసాయం చేశారు సహజంగా లభించే వాటినే తిన్నారు తప్ప ప్రకృతిని ఏమాత్రం పాడు చేయలేదు.

ప్రకృతి మాత ప్రసాదించిన వారు స్వీకరించారు చింతపండు, మామిడి, సీతాఫలం, మునగ లాంటి పదార్థాలు స్వీకరించి జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి బలమైన తిండ్లు తింటూ ఉన్నారు. అందువల్లే వారు ఎంతో ఆరోగ్యంగా నూరేళ్లు బ్రతికగలిగారు కానీ ప్రస్తుతం మనం సహజంగా దొరికే ఆహారాన్ని కాకుండా రకరకాల పేర్లతో పెట్టి విచ్చలవిడిగా వాడుకుంటూ పిజ్జాలు బర్గర్లు అని పిచ్చి పిచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం.

రంగులు కలిపిన ఆపిల్ లాంటి పండ్లను తింటూ అలాగే రాగులు, సజ్జలు లాంటి సాంప్రదాయ వంటకాల జోలికి వెళ్లకుండా తెల్లని మైదాకు ఆకర్షితులం అవుతున్నాం. ఇప్పటికీ కొందరు గిరిజనులు ప్రకృతి సహజంగా లభించిన ఆహారాన్ని తీసుకుంటూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రజల్లోనూ కొంచెం చైతన్యం కలుగుతుంది.

ఆరోగ్యానికి ఏది మంచిది ఏది చెడ్డదో తెలుసుకొని చాలా వరకు మిల్లెట్స్ అంటే రాగులు సజ్జలు తింటున్నారు కానీ అందులో కూడా నకిలీవి వస్తున్నాయి. కూర్చుని చేసే పనులే కాబట్టి ఎక్కువ కష్టం లేకుండా ఉండే పనులే కాబట్టి అందరూ జిమ్ముల వెంట పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు అయినా రోడ్డు పక్కన ఉన్న మిర్చి బండిని చూడగానే పాదాలు పరుగులు తీస్తాయని అనడంలో సందేహం లేదు.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *