ఆదిత్య హృదయం
నీకై వేచేము
నీడగ నిలిచేవని
పయనము నీదయ్యా
పలుకే మాదయ్యా
లేదు మాకు శాంతయ్యా
చికాకు చినుకుల్లో
తడిసేము చూడయ్యా
వెలుగై రావయ్యా
కొండా కోనలలో
పల్లె పట్నాలన్నీ
తిరుగుతు ఉంటావు
నవ్వుతూ చూస్తావు
అలుపే లేకుండా
అవనిని చుడతావు
నువు లేకుంటేను
మాకేమొ బెంగయ్యా
తిరుగుట సంబరమై
అంబరాభరణమై
సాక్షీభూతుడివే
ఆదిత్య హృదయుడివే
– సి.యస్.రాంబాబు