తీరం
జ్ఞాపకాల తీరాలన్నీ తరలి వస్తాయి
తలపుల తోటలో నువ్వుంటే
కలల తోటలన్నీ వికసిస్తాయి
కళల సమాహారమై కదిలావంటే
వెతల కోతలన్నీ నిష్క్రమిస్తాయి
సంకల్పమై నువు ఉద్యమిస్తే
నేర్చుకున్న పాఠాలన్నీ నీడనిస్తాయి
అనురాగ గోపురమై నువ్వుంటే
పడిలేచే కెరటం నవ్వు నురగై చుట్టేస్తుంది
నీలోకి నువు పయనిస్తే
– సి.యస్.రాంబాబు