వరద ఉధృతి

వరద ఉధృతి

ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. దానివల్ల
హైదరాబాద్ నగరంలోని
నాలాలే కాకుండా తెలంగాణ
ప్రాంతంలో ఉన్న నాలాలు అన్నీ
పొంగిపొర్లుతున్నాయి. ఆ నీరు
చెరువులలోకి ప్రవహించి ఆ
చెరువులు నిండిపోతున్నాయి.
చెరువులు నిండిపోయాక ఆ
నీరంతా చెరువుల చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాల్ని ముంచి వేస్తున్నాయి. ప్రభుత్వం
విద్యా సంస్ధలకు సెలవలు
ఇచ్చింది. ఇంతవరకు బాగానే
ఉంది కానీ ప్రతి రోజూ పని
చేస్తే కానీ పూట గడవని
వారు ఎందరో ఉంటారు. వారికి
వారం రోజుల నుండి ఏ పనీ
లేదు. వారి బ్రతుకులు దిన
దిన గండం నూరేళ్ళ ఆయుష్షు
అన్నట్లు ఉన్నాయి. వారికి కనీస

అవసరాలు కూడా తీరటం లేదు.

ఆహారం అసలేదొరకటం లేదు.

ఈ విషయంలో
ప్రభుత్వం చొరవ చూపిస్తుంది
అని ప్రజలు ఆశిస్తున్నారు.

వాన తగ్గాక పాడయిన చోట్ల రోడ్లు వెయ్యాలి.

ఇప్పుడైతే
ఇళ్ళు పాడయిన వాళ్ళకు
నివాసయోగ్యమైన ప్రాంతంలో
ఇళ్ళు ఇవ్వాలి. చెరువులకు
ఆనుకుని ఇళ్ళు నిర్మించకుండా
కట్టడి చేయాలి. అవసరమున్న
సమయంలో సహాయం చేయాలి

కానీ సమస్య తీరిపోయాక సహాయం చేస్తే
ఎవరికీ ఉపయోగం ఉండదు.

-వెంకట భాను ప్రసాద్

0 Replies to “వరద ఉధృతి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *