అపుడే ఆగిపోయావా
ఓయ్ వర్షం ఏంటి అపుడే ఆగిపోయావా..!
వెళ్ళిపోతున్నావా?
ఏంటి! వెళ్లక ఇక్కడే ఉండి మీతో
శాపనార్ధాలు పెట్టించుకోమంటావా?
అలా కాదు వర్షం నీకూ తెలుసా
నీవు ఉన్న ఈ వారం రోజులు నీలో
తడుస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో..
పసి పాపనై బాల్యం లోకి వెళ్లిన అనుభూతి కలిగింది..
ఓరిని నీకూ ఇలా అనిపించిందా?
హ….
సరిపోయింది నా వల్ల రైతులకు ఎపుడు
కష్టం వచ్చేది ఎక్కువుగా నేనూ ఉంటే…
కానీ ఈ సారి ప్రతి ఒక్కరూ నేనూ త్వరగా వెళ్ళాలి
అని కోరుకుంటూ ఉంటే నువ్వు
ఏమో ఇలా విచిత్రంగా అడుగుతున్నావు..
అయ్యో వర్షం ఒకే పుస్తకం ఇద్దరు వ్యక్తులు
ఒకే టైమ్ లో మొదలు పెట్టి ఒకే టైమ్ కూ
పూర్తి చేసి ఒకే లాగా సమీక్షా ఇస్తారా లేదు గా.. ఇది అంతే..
మనము మన చూసే తీరు ఆలోచించే
విధానంలోనే మన సమస్య ప్రభావం ఉంటుంది..
వర్షం…..అంతా నిన్నూ ఇలా బరువుగా చూసారు
నేనూ బరువులోనూ సంతోషం వెతుకున్న అంతే…
-కళ
చాలా బాగుంది కళ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌