మరో మార్గం
“రేయ్… రవి గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నావ్ కదా. ఎగ్జామ్స్ ఇంకా రెండు వారాల్లో ఉన్నాయి రా” అని చెప్పాడు కిరణ్.
“పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది రా. మన కష్టాలన్ని తొలగిపోతాయి రా” అని చెప్పాడు రవి.
“అవున్రా… నీకు ఆ ఉద్యోగం రావాలనే రాత్రి పగలు చదువుతున్నావు” అని చెప్పాడు కిరణ్.
నీకు తెలుసు కదా నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. అమ్మ , చెల్లిలను చూసుకోవాల్సిన బాధ్యత నామీద ఉంది. వాళ్ళని బాగా చూసుకోవాలంటే నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం రా” అని చెప్పాడు రవి.
రెండు రోజుల్లో ఎగ్జామ్ వెళ్లాలని హడావుడిగా ఉన్నాడు రవి.కిరణ్ చూస్తుండగా న్యూస్ లో టీవీ చూస్తుండగా న్యూస్ లో గ్రూప్స్ పేపర్ లీక్ అయిందని చెప్పారు.కిరణ్ ఆ న్యూస్ చూసి షాక్ తో కాసేపు అలాగే ఉండిపోయాడు.
కాసేపయ్యాక షాక్ నుండి తేరుకొని రవి దగ్గరికి పరిగెత్తాడు.ఆయాసంతో రేయ్ రవి… అని పిలిచాడు కిరణ్.“ఏంట్రా… ఏమైంది… ఎందుకు ఆయాస పడుతూ వచ్చావు?” అని చెప్పి నీళ్లు తీసుకువచ్చి ఇచ్చాడు రవి.
” రేయ్… టీవీలో గ్రూప్స్ పేపర్ లీక్ అయిందని చెప్తున్నారు రా” అని విచారంగా చెప్పాడు కిరణ్.“అవునా… పద ఒకసారి చూద్దాం” అని కిరణ్ వాళ్ళింటికి వెళ్లారు.
రవి ఆ న్యూస్ చూసి“నేను బాగా చదివాను రా , కానీ ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ హడావుడి వల్ల పేపర్ లీక్ చేయడం , ఏంట్రా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా?” అని ఏడుస్తూ చెప్పాడు.
“నువ్వేం బాధపడకు రా. గ్రూప్స్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టాతారు రా అప్పుడు రాయచ్చు, కానీ ఆ లోపు నువ్వు ఏదో ఒక మంచి జాబ్ చూసుకో రా” అని చెప్పాడు కిరణ్.
కొందరు ఎంతో సిన్సియర్‌గా చదివిన కూడా మరికొందరు పేపర్ లీక్ చేసి చదివిన వాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారు.
పేపర్ లీక్ చేస్తే కొందరికి మంచిదే అవ్వచ్చు కానీ మరికొందరికి జీవితమే పోతుంది.
రవి పరిస్థితి కూడా అలాగే అయ్యింది రవి జీవితం కూడా అలాగే అయింది. చిన్న ఉద్యోగం చేసుకుని దాంట్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పై స్థాయికి ఎదిగాడు.మరికొందరు రవిలా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు.
అలాంటి పిచ్చి పనులు చేయకుండా తర్వాత ఏం చేయాలి అని ఆలోచించండి అప్పుడే మీ జీవితం బాగుంటుంది.
మనకి ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గం ఉంది. ఆ మార్గంలో నడిస్తే మన జీవితం బాగుంటుంది.
-మాధవి కాళ్ల