ఇల్లాలు
ఇల్లు చూసి ఇల్లాలును చూడమన్నారు పెద్దలు
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఇల్లాలే దేవత అన్నారు
ఇవన్నీ నిజమే మరి..
ప్రతి ఇంటికి ఇల్లాలే ఒక దీపం నిజమే ఆ
ఇల్లు వెలుగును పంచుతూ తను బాధలు అనుభవించినా
పైకి మాత్రం నవ్వుతూ పిల్లలను పైకి తెస్తుంది..
బార్య అనే పదానికి అర్థం చెప్తుంది..
ఇల్లాలు లేని ఇల్లు వెల వెల బోతుంది..
సుధ కూడా అంతే!
మామూలు గృహిణి చిన్న ఉధ్యోగి..
అయినప్పటికీ!
ఇంట్లో బయటా తనే కష్ట పడుతుంది ఇద్దరు పిల్లలను
కన్నది..
పిల్లలు తనలా కష్టపడకూడదని వాళ్లను బాగా
చదివించి తన శాయ శక్తులా శ్రమించి విదేశాలకు
పంపించింది..
తను చేసే ఉధ్యోగం తోనే ఇల్లు నెట్టుకొచ్చే సుధ
ఆహర్నిషలు కష్టపడి పెద్దమ్మాయిని విదేశానికి పంపడంతో ఆర్థిక సమస్య తీరింది..
ఆవిడనందరూ భయపెట్టిన వాళ్లే! ఎందుకలా పంపిస్తావని ఎద్దేవా చేసిన వాళ్లే!
ఇప్పుడు కూతురు డబ్బు పంపిస్తుంటె పెద్ద ఇల్లే కొన్నారు..
ఇప్పుడందరూ ఆ మహోన్నత స్త్రీ శక్తిని పొగుడు తున్నారు..
భర్త భయపెట్టినా ఎవరెన్ని చెప్పినా తన లక్ష్యం వీడ
కుండా కష్టపడి పిల్లలను పెద్ద చేసింది..
ఏ నిందలకూ భయపడ లేదు..
కాబట్టి ఆడవాల్లూ! ఏ నిందలకూ భయపడకుండా
స్త్రీ శక్తిని ఋజువు చేసుకోండి!
ధైర్యాన్ని ఎప్పుడూ విడనాడొద్దు..
ధైర్యే సాహసే లక్ష్మీ!! అని మరిచి పోవద్దు…
ఆడవాల్లూ మీకు జోహార్లు అనిపించు కోవాలి..
సుధ లాగా ధైర్యాన్ని చూపించి తన పిల్లలను
ఉన్నత పదవుల్లో ఎలా వాల్లను రాణింప చేసిందో!
అలా గృహిణులైనా అందరూ గర్వించేలా బ్రతక గలగాలి..
ఆ ఇల్లాలే ఆ ఇంటి దేవత అయింది..
-ఉమాదేవి ఎర్రం