పెద్దలు కుదిర్చిన పెళ్లి
పూజ చేసుకుని రవి తన భార్య ఎదో ఆలోచనలో వుందని గమనించాడు.. దగ్గరకి తీసుకుని, ఎంటి రాధ ఆలోచన అని అడిగాడు.. ఏమి లేదు ఆఫీస్ కి టైమ్ అవుతోంది వెళ్ళండి అని దాటేస్తోంది రాధ.. అభ! చెప్పు ఎంకావలి అని అడిగాడు రవి..
నా తమ్ముడు భువన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అని చెప్పింది.. ఓ అవునా సరే అత్త, మావలకు చెప్పి పెళ్లి చేయమను. దానికి అంత దిగులెందుకు అన్నాడు రవి…
చెప్తే నన్ను, ప్రేమించినందుకు వాడిని, సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని.. నూనెలో వేయిస్తారు మా నాన్న అంది రాధ కంగారుగా..
ఎంత వంట వాళ్ళయితే మనల్ని ఎందుకు వేయిస్తారు మీ వాళ్ళు…అయినా అందులో తప్పేముంది, ప్రేమించడం తప్పు పని కాదు కదా.? అన్నాడు రవి…
ప్రేమది కాదు తప్పు వాడు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే అప్పుడు అవుతుంది తప్పు అని అంది రాధ..
ఎవరు అని అడిగాడు రవి…
ఆమె పేరు మేరీ..ఓహో అదా అంటూ రవి దీర్ఘం తీస్తుంటే..అంతే కాదు ఆమె మూగది కూడా.. వీడికి అన్ని బావుంటాయి పైగా మన ఆచారాలు వేరు.. ఇవన్నీ తెలిసి వాడు ప్రేమించడానికి వీలైన, నేను మావాల్లకి చెప్పి ఓపించడం కష్టం అంది రాధ..
మీ తమ్ముడు తెలివైన వాడు నోరు లేని పిల్లని పెళ్లి చేసుకోవడం అదృష్టం అని అనుకుంటూ…ఏదో చిన్న కొరికేమో తీర్చేదం అనుకున్న కానీ ఇది చాలా పెద్ద విషయం పైగా ప్రేమ.. మనకసలే అనుభవం లేదు అనుకుని రవి మెల్లగా ఆఫీస్ కి జారుకున్నాడు…
వెళ్ళే దారిలో పక్కన ఒక అమ్మాయి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తోంది ఎవరూ ఆగడంలేదు.. రవి ఆమెకి ఒక కాలు లేదని చూసి కారు ఆపి ఆమెకు సహాయం చేస్తాడు… దారిలో అతను మరిది ప్రేమించిన అమ్మాయి ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవడానికి పెళ్లి చేసుకుందాం ,అనే ఆలోచన వుందేమో అని అతనికి ఫోన్ చేసి ప్రేమ విషయం అడుగుతాడు…
భువన్ మేరీ తన క్లాస్ మెట్ అని తను మూగదని చెప్తాడు.. ఆమె పడే ఇబ్బందులను చూసి తనకి తోడుగా వుండాలనే తన ఆలోచనను రవికి చెప్తాడు.. ఒకరికి సాయం చేసే గుణమున్న రవి భువన్ ఆలోచనని గౌరవించి పెద్దలకి చెప్పాలని రవి రాధ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు..
బావగారు పెళ్లి పెద్ద అయ్యి మేరీ భువన్ లను కలిపారు..
మేరీ కి ఓ ధైర్యాన్ని ఇచ్చారు..
– శ్రీ కిరణ్