గులాబినేను
పల్లవి
ముళ్ల తోటలో… పూసిన ఓ గులాబి నేను…నన్నే తెచ్చి.. ఆ దేవుడి మెడలో పూల మాలగా.. చేర్చావు?
పువ్వుకి రేకుల రాలిపోతున్న..నా జీవితాన్నే… చెట్టుకు ఇగురులా… నన్నే చేర్చావు?
చరణం1
ఎక్కడి నుంచి వచ్చవో కానీ.. నా చిమ్మ చీకటిని రంగుల హరివల్లులా… మర్చావు?
ఎప్పుడు నిన్ను చూశానో కానీ… నా కంటి రెప్పలా నాతోనే ఉన్నావు?
చరణం2
రెక్కలు లేని… పక్షల్లే ఉండేదాన్ని.. నువ్వు వచ్చాకే.. రెక్కలు విప్పిన.. పావురంలా ఎగురుతున్న..
ఎప్పుడూ.. కన్నీళ్లతోనే ఉండేదాన్ని.. నువ్వు వచ్చాకే.. నా పెదాలపై… చిరు నవ్వే వచ్చింది.
చరణం3
ఎప్పుడూ.. సైలెంట్ గా ఉండేదాన్ని.. నువ్వు వచ్చాకే అలల అల్లరి చేస్తూ.. పసి పాపలా ఆడుకుంటున్న..
నీటిలో… చేప పిల్లలా ఉండేదాన్ని… నన్నే తెచ్చి…
ఈ లోకానే.. అందంగా చూపావు?
చరణం4
ఆ నింగిలో ఉన్న..నక్షత్రమే నాతో స్నేహం కోరి వచ్చిందా…
నిన్నే… ఆ బ్రహ్మే పంపడేమో.. నా కోసం
ఎప్పుడూ.. ఎవ్వరు లేరు? అనుకునే.. నాకే వరమల్లే.. కలిశావు?
చరణం5
ఎప్పుడూ… నా చుట్టే ఉంటూ..నా నీడలా మారవు?
అడుగే.. పడని దారిలో… తోడై నిలిచావు?
ఆ చందమామ చెప్పాను, నా వెలుగు నువ్వని..
నా మువ్వల శబ్ధం చెప్పాను, నా గుండె చప్పుడు. నువ్వని..
చరణం6
నా మనసుకు చెప్పాను, నువ్వే లేకుంటే.. నేను ఒక రాతి బొమ్మనేనని..
ఆ కృష్ణయ్య కలిపెను, నాలో నిన్నే..
ఆ గాలే చేరేను, నాలో నీ శ్వాసగా…
చరణం7
నువ్వే నాతో ఉంటే.. ఈ లోకాన్నే మర్చిపోతా…
నిన్నే క్షణం మర్చిపోతానేమో అని.. కళ్ళ నిండా నిన్నే నింపుకున్న…
ఇది వరకు లేని సవ్వడి… మనసులో నువ్వు వచ్చాచకే… మొదలైనది. ఈ సందడి.
చరణం8
నా గుండెల్లో ఉండిపో… నీకు గూడే కడతాను,
నీ మీద ఉన్న ప్రేమే లికించే… కలన్ని నేనౌతా..
అమ్మల్లే నిన్ను నిద్రపుచ్చే… జోల పాటను నేనౌతా..
నీ కన్నుల్లో… అందమైన కలను నేనౌతా..
నా కట్టే కాలే వరకు… నీ వెంట నీడై ఉంటా…
పల్లవి
ముళ్ల తోటలో… పూసిన ఓ గులాబి నేను…నన్నే తెచ్చి.. ఆ దేవుడి మెడలో పూల మాలగా.. చేర్చావు?
పువ్వుకి రేకుల రాలిపోతున్న..నా జీవితాన్నే… చెట్టుకు ఇగురులా… నన్నే చేర్చావు?
-మంజులత