ఎవరి కోసం ..?

ఎవరి కోసం ..?

గణేష్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గపు నివాసి. అతడు పాఠశాలలో వున్నప్పుడు A+ గ్రేడు విద్యార్థి . 8వ తరగతి అతడికి తనతోటి విద్యార్థిని మరియు స్నేహితురాలు అయినా భార్గవి prapose ( LOVE ) చేసింది . మెదట్లో గణేష్ ఆమె ప్రేమ పట్టించుకోలేదు . కొన్ని రోజుల తరువాత గణేష్ కి కూడా భార్గవి మంచి అభిప్రాయం వచ్చాక గణేష్ కూడా భార్గవిని ప్రేమించాడు.

Intermediate విద్య కోసం గణేష్ మరియు భార్గవి ఒకే కళాశాలలో join అయ్యారు . 2 సంవత్సరాలు ఇద్దరు కలిసి కళాశాలకు వెళ్లి రావడం ,దేవాలయలకు వెళ్లి రావడం వంటి తదితర పనులు చేసే వాళ్ళు . intermediate చివరి పరీక్షల సమయంలో వీరి ప్రేమ విషయం వారి వారి తల్లిదండ్రులకి తెలిసిపోయింది. భార్గవి ఉన్నటాచదువులకి వెళతాను అంటే వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. గణేష్ వాళ్ళ తల్లిదండ్రులు గణేష్ తో ఇలా అన్నారు ‘ ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య పుడుతుంది ఇది సహజం ,మంచిది కూడా . ప్రేమించించడం తప్పు అని నేను చెప్పను.

కాని ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోవాలి అంటే తనని బాగా చూసుకోవాలి . కాబట్టి నువ్వు జీవితంలో ఇంకా ఎదగాలి సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు వచ్చాక నీ చదువు అంత పూర్తి అయినా తరువాత నువ్వు ప్రేమించిన అమ్మయితో నీ వివాహం మేము జరిపిస్తాము ’ అన్నారు. ఏంతో సంతోషపడ్డాడు గణేష్ తన తల్లిదండ్రులను హత్తుకొని ఏడ్చేశాడు, కంట్లో ఆనందబాష్పాలు రాలుతున్నాయి , నోట మాట రావడం లేదు గణేష్ కు.

గణేష్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు తన Degree విద్యను పూర్తి చేసుకొని ప్రేమించిన అమ్మయిని పెళ్లి చేసుకోవాలి అనుకొన్నాడు. కొన్ని రోజుల తరువాత Degree admission open అయ్యాయి. BSc GEOLOGY ATP ARTS COLLEGE ( autonomous) లో seat వచ్చింది . గణేష్ భార్గవికి call చేసి తన ఇంట్లో జరిగిందంతా చెప్పాడు భార్గవి చాలా సంతోషించింది. గణేష్ ‘ నేను degree చదవడం కోసం అనంతపురం వెళుతున్నాను ‘ అని చెప్పాడు . తనకు దూరంగా వెళుతున్నాడు అని బాధ పడినా మరలా తన కోసం గణేష్ వస్తాడు అని భార్గవి ఆనందపడుతూ గణేష్ ని అనంతపురంకి సాగనంపింది.

అనంతపురంలో గణేష్ చుట్టూ కొత్త మనుషులు , కొత్త వారితో పరిచయాలు అందరితో సులభంగా కలిసిపోయేవాడు. కళాశాల తరగతి గదిలో “ చిన్న ” అనే ఒక విద్యార్థి గణేష్ మంచి మిత్రులయ్యారు . గణేష్ 2 లేదా 3 రోజులకి ఒకసారి భార్గవితో phone call మాట్లాడే వాడు. కొన్ని రోజుల తరువాత భార్గవికి call చేస్తే ,switch off vachhindi . ఎన్ని రోజులు గడిచినా తన నుండి ఎటువంటి response రాలేదు.ఇక చేసేది ఏమిలేక చిన్న మరియు గణేష్ కలిసి కడపకు భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్లారు . కాని అక్కడ తను లేదు. గణేష్ , చిన్న ఇద్దరు గణేష్ వాళ్ళ ఇంటికి .

కొద్దిసేపటి తరువాత గణేష్ కి భార్గవి తల్లిదండ్రులు phone చేసి ఒకసారి నిన్ను కలవాలి అని వారు ప్రస్తుతం నివాసం వుంటున్న ఇంటికి రమ్మని address చెప్పారు. ఇద్దరు భార్గవి వాళ్ళ తల్లిదండ్రులని కలవడానికి వెళ్లారు .గణేష్ ని చూసిన భార్గవి తల్లిదండ్రులు మొహం చాటేశారు. ‘ ఏమైంది sir ‘ అని గణేష్ అడిగాడు బాబు మమ్మల్ని నువ్వు క్షమించాలి అని అన్నారు . గణేష్ కి చిన్నకి ఏమి జరిగిందో ? ఏమి జరుగుతుందో అర్థం కాలేదు కావడం లేదు.

అప్పుదు భార్గవి వాళ్ళ నాన్న గారు అన్నారు ‘ గణేష్ నువ్వు మా అమ్మాయి భార్గవి ప్రేమించుకొన్న విషయం మాకు తెలిసిపొయింది. నువ్వు అనంతపురం వెళ్లిన తరువాత కొన్ని రోజులకి తనకి వాళ్ళ బావతో వివాహం జరిపించాము అని అన్నారు .గణేష్ ఒక్కసారిగా గుండె పగిలినంతలా ఏడ్చేసాడు . చిన్న ఆశ్చర్యం వేసింది. కొద్దిసేపటి తరువాత చిన్న భార్గవి వాళ్ళ నాన్న ని ఇలా అడిగాడు ‘ భార్గవి పెళ్ళికి ఒప్పుకుందా..? ఇప్పుడు తను ఎక్కడుంది …? ఎలా వుంది …? భార్గవి వాళ్ళ అమ్మ ఏడుస్తూ తనకి ఇష్టం లేని వివాహం జరిపించామని మాపై చాలా కోప్పడింది .

తన వివాహం జరిగిన ఒక నెలలోపు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పింది . గణేష్ బోరున ఏడ్చేసాడు .భార్గవి వేరే వాళ్ళ సొంతం అని చాలా బాధ పడ్డాడు.తను ప్రాణాలతోనే లేదని తెలిసాక కన్నీటిపర్యంతం అయ్యాడు .మీ అమ్మాయి ప్రేమించిన వాడితో తన వివాహం జరిపించి ఉంటే లేదా తనని ప్రేమించిన వాడితో ఎక్కడికైనా పంపించేసివుంటే మీతో లేక లేచిపోయిన కానీసం ఎక్కడో ఒకచోట ప్రాణాలతో అయినా వుండేదేమో అన్నాడు.

చిన్న భార్గవి వాళ్ళ తల్లిదండ్రులని చూస్తూ….! గణేష్ చిన్న ఇద్దరు ఎవరి ఇళ్ళకి వాళ్లు వేళ్ళిపోయారు.కొన్ని రోజులకి గణేష్ మత్తుపదార్థాలకి,మద్యానికి బానిసయ్యాడు .చదువుకొని కుటుంబాన్ని చక్కగా చూసుకోవలసిన కొడుకు ఇలా తాగుబోతులా అయ్యేసరికి , మనస్థాపం తో గణేష్ తండ్రి మరణించాడు. కొన్ని రోజుల వ్యవదిలోనే అనారోగ్యం తో గణేష్ వాళ్ళ అమ్మగారు కూడా మరణించారు.

నడిసంద్రంలో తప్పి తెప్పలా తయారయ్యింది. గణేష్ జీవితం. సంద్రం లో ఎంత నీళ్లు వున్నా తాగడానికి పనికిరావు.గణేష్ కు కనిపెంచిన తల్లిదండ్రులు లేరు.ప్రాణంగా పేమించిన ప్రేయసి లేదు. తన చుట్టూ ఎంతమంది వున్నా తనకి తల్లిదండ్రులు లేని లోటు, ప్రేయసిలేని లోటు ఎవరూ తీర్చలేరు..

ఎవరి కోసం ….?
అతని ఊపిరి….!

 

M. తిప్పేస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *