బాటసారి
ఒంటరి పోరులో అలసిపోయిన
బడుగు జీవితం నాది…
బహుదూరపు బాటసారిలా
సాగుతున్నా నా జీవన ప్రయాణంలో..
మది తలుపులు మూసుకోని
మౌనంగా రోదిస్తున్నా నా హృదయం
బతుకు భారమై గుండే చెరువై
సాగుతున్నా నా బ్రతుకు పోరులో..
అలసిన నేను… మదితలుపులు మూసుకోని
మౌనంగా రోదిస్తున్నా నా హృదయం…
అక్షరాలకై ఆరాటపడుతుంది
కొంతకాలంగా అక్షర లిపికి దూరమై అక్షరాలనే మరిచిపోతున్నా…
-అంకుష్