మట్టి కణమే… గాని….
మట్టి కణాన్నే…. నే
నిప్పు గుళిక లై
మనసును రాజేసా…
నను కరిగించి మరిగించి
మురిపించి.. మరిపించి..
హృదయ రాగంజలై…
వేణు గానమే
దారలై పారెలోగా….
ఎక్కడో…
గుస గుస లాడింది…
మలిన మైన మనసు తో
దేవుడ్ని చూడలేవని!!!
అయ్యో… మరి అహల్య
బండ రాయి గానే మిగలేదే
శ్రీ రాముని అనుగ్రహం కలుగలేదా!!!
గతం లోని కర్మలు
భవిష్యత్ కే అడ్డమైతే
ప్రపంచం చూసిన విప్లవాల
సంగతేంటి…
ఖర్మలు మార్చలేమేమో గాని..
కర్మలు మార్చగలం
ప్రపంచం ముందుంది
ముందే… ప్రపంచముంది
దేవుని సృష్టిలో ప్రతిదీ…
అద్భుతమే…
అందుకే ఆవిరై కలిసాను గాలిలో…
ఎడారి దాటుతూ…
చాటాను..
నేనొక అద్భుతమని…
అద్భుత దీపమని…
– అల్లావుద్దీన్