తొలిసంధ్య

తొలిసంధ్య

నిలకడలేని హృదయాలుంటాయేమో కానీ
నిలకడలేని ఉదయాలుండవు
అప్పుడే పూచిన పువ్వులా విప్పారుతూ ఉదయం
వినిపించని రాగాలను శ్రుతిచేస్తుంది

ఉదయాన్నే ఓ వెలుగు రేఖ ఆనందాన్ని ఒంపుతుంటే
పరవశించని మనిషెందుకు
నీకు నాకూ లక్ష గొడవలుండొచ్చు
కలిసి ఉదయాన్ని చూశామా
వేరే సంధి అక్కర్లేదు
తొలిసంధ్య తొలకరి జల్లులాంటిది

– సి.యస్.రాంబాబు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *