మది
జ్ఞాపకమే కానీ గడిచిన స్థితిగతులు నా మదిని జీవచ్చవమ్లా ఏమి మార్చలేదు. జీవించే విధానాన్ని మార్చుకోమన్నది. సిగ్గు బిడియం లేకుండా ఆనందవికాసం కోసం చిన్ననాటి రోజున చినిగిన చొక్కా, తూట్ల నెక్కరు ధరించి పంచరైనా టైరును పరిగెత్తించినపుడు చినిగిన చొక్కా గుర్తుకురాలేదు. తూట్ల నెక్కరు గుర్తుకురాలేదు. ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది. ఈ శీర్షిక ఇచ్చిన మరుక్షణం
పెరిగి పెద్దయ్యాక కన్నులు కలకన్నాయి కలిసి ఉన్న జంటను చూసి జంట దొరికాక వెంటపడ్డ గొడవలు గోడ పెట్టాయి. మనసుకు మనసుకు మంట పెట్టాయి. నేడు ఈ జ్ఞాపకం లా బయటపడ్డాయి.
ఆదివారం తూర్పుదిక్కున పొడిచిన పొద్దు ముద్దుగా అనిపించినా క్షణం, పడమర దిక్కున గడిచిన పొద్దుగడవవొద్దన్న క్షణం, కళాశాలలో ప్రేయసి చేతులు విడువవొద్దన్న క్షణం, నేడు ఈ శీర్షిక ద్వారా జ్ఞాపకంలా బయటపడ్డాయి.
ఈ ఆలోచన శీర్షిక ఒకరోజు మంచి జ్ఞాపకo గా మిగులుతుందని, ఏదైనా ప్రస్తుత క్షణం మరుక్షనానికి జ్ఞాపకమే అని అది మంచి లేదా చెడు జ్ఞాపకమా ప్రస్తుత నడవడిక నిశ్చయిస్తుంది.
– హరికృష్ణ