సమాజం నాయిజం
సమాజం నన్ను అర్దం చేసుకోవాలని అనుకున్న
నేను మాత్రం సమాజాన్ని అర్దం చేసుకొని బ్రతుకుతున్నా…
నేటి సమాజంలో నచ్చిన మనిషిని సందడితో సాంగనంపుతారు..
సజీవంగా ఉన్న వాళ్ళను సంతోష పరచలేరు..
డబ్బును ప్రేమించారు ,
సొంత వాళ్ళనే పరాయి వాళ్ళగా చూస్తారు..
సమాజం కోసం బ్రతకకూడదు ,
సమాజంతో బ్రతకాలి..
ఆడపిల్లలు అణిగిమని ఉంటే అవసరం అంటారు..
ధైర్యంగా ఉంటే బలుపు అంటారు..
ఎదిరిస్తే పొగరు అంటారు…
స్టైల్ గా ఉంటే ఎవరి కోసం అని అడుగుతారు…
కోపంగా మాట్లాడితే కొవ్వు అంటారు…
ఆనందంగా ఉంటే అసూయ పడుతారు…
సమాజాన్ని అర్దం చేసుకొనే లోపు నీ జీవితం సగం అయిపోతుంది..
నీకు ఏం కావాలో దాని సాధించుకో…
కొన్ని సందర్భాల్లో కొందరికి సమాజంలో తలవంచక తప్పలేదు…
సమాజం ఎప్పుడు మంచివాడని అసలు గుర్తించదు..
మంచివాడి మాటలు నమ్మకుండా ,
మోసం చేసే వాడి మాటలు గుడ్డిగా నమ్ముతారు…
సమాజంలో ఎవరికి తలవంచక బ్రతకడం చాలా కష్టం..
సమాజం నాయిజంతో ప్రతి రోజు ఒక సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..
– మాధవి కాళ్ల