రసగుళిక
లోక సమస్తం సాగిలపడే
వర్ణరంజితమైన
రసగుళిక నీ జీవితం..
క్షణమాత్రమైనా విలక్షణంగా తీర్చిదిద్దుకో..!
మృత్యుగానాలు వెంటాడుతున్నా..
విషాదగీతాలు
శృతిమించుతున్నా..
తావలం కాకు ఉదాసీనతకు..
తాపడం చేసుకో
మనిషి అనే
అస్తిత్వం నుంచి మనీషిగా
నిన్ను నువ్వు..!
ఆటంకాలనే అనగొండలను
పెకిలించి
అహంకార, మమకారాలను జయించి
నచ్చినట్టుగా ఉండు..!
ఇచ్చి పడేసెయ్ ముందు..!
– మామిడాల శైలజ.