ఆనందమైన జీవితంలో అపశృతి
నేను నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్న రోజులే ఎక్కువ. ఒక శుభవార్త తరువాత మరొకటి విన్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. ఎలా నా సంతోషాన్ని ముందుగా ఎవరితో పంచుకోవాలో నాకే అర్దం కావడం లేదు. ఆలోచిస్తుండగా మదిలో నా స్నేహితురాలు మెదిలింది.
నా ఆనందాన్ని తనతో చెప్పుకొని ప్రయోజనం కలుగుతుంది. నాకు కొన్ని విషయాలలో స్ఫూర్తిగా తీసుకొని నాకు తోడుగా ఉండేది. అందరూ ఒక చోటు కలిసి ఆనందంగా ఉన్న సమయంలో నా జీవితంలో ఒక అపశృతి చోటుచేసుకుంది. అందులో ఉండి నేను బయటకు రావడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా అసలు బయటకు రాలేకపోయాను. ఎప్పుడు నేను నా ఆనందమైన జీవితంలో ఒక అపశృతి జరగడం వల్ల నేను కోలుకోవడానికి చాలా టైం పట్టింది.
అందరిలో కలవడానికి చాలా టైం పట్టింది. నన్ను నేను గతంలో ఉండనికి చాలా ప్రయత్నం చేస్తాను. కాలం ఎంతటి గాయాన్ని మరచిపోయ్యోలా చేసింది. కానీ ఒకటి మాత్రం నిజం, గాయం తాలూకు మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు చూసిన ప్రతి సారి ఆ అపశృతి గుర్తుకు వస్తునే ఉంటుంది.
- మాధవి కాళ్ల