నిర్లిప్తత
మనంత బంగారు జీవితం కాదీ రాజ్యమ్మది
బంగారు తీగ, గడ్డిమోస, రాగండి చేపలు బీసెంట్ రోడ్ మార్కెట్ లో కొని
వన్ టౌన్ లో ఇంటింటికీ తిరిగి అమ్ముకుని మూడొందలు సంపాదిస్తుంది.
అంటే ఎంత
మనం కొన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మల్టీ ప్లెక్స్ టికెట్ అంత..
జీవితమింత కష్టం గా ఉందన్న బాధ తను మొహంలో కనపడ లేదు..
రేపు గొప్పగా ఉంటుందన్న ఆశ కనపడలేదు..
ఎలా సాగితే అలా సాగుతుందన్న నిర్లిప్తత తప్ప
– సి యస్ రాంబాబు