చీకట్లు
ఈ చీకట్లు ఎన్నో అంధకారంలో మగ్గిపోయిన జ్ఞాపకాలను నిద్రలేపుతున్నాయి.
ఈ చీకట్లు ఎన్నో మూగబోయిన హృదయ స్వరాలను తమ గానం వినిపించమంటున్నాయి.
ఈ చీకట్లు ఎన్నో మిగిలిపోయిన కలలను ఆకర్షణీయ వర్ణాలతో మళ్లీ కనమంటున్నాయి.
ఈ చీకట్లు ఎన్నో నలిగిపోయిన కళలను వినూత్న రీతిలో పునరుద్ధరించమంటున్నాయి.
ఈ చీకట్లు నా ఇక్కట్లను చీల్చుకుంటూ ముందుకు సాగమని నన్ను ప్రేరేపిస్తున్నాయి.
– శంభుని సంధ్య