నిలకడ లేని మనసు
నిన్ను చూసిన మరో క్షణం నుంచి
నాలో ఎదో తెలియని అనుభూతి లోనవుతుంది…
నా మనసులో ఆలోచనలు ఆగడం లేదు
ఏ పని మీద అయిన శ్రద్ధ చూపలేకపోతున్నా…
ఎందుకు నీ మీద నా మనసు నిలకడగా ఉండడం లేదు…
నీ గురించి ఎన్నో ప్రశ్నలు
నా మదిలో మెదులుతున్నాయి…
వాటికి జవాబులు తెలుసుకోవడానికి
ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది…
నీ ఆలోచనల్లో నేను నిలకడ లేని మనిషిగా ఉండలేకపోతున్నా…
నీ ప్రశ్నలతో నేను నిలకడ లేని మనసుగా మిగిలిపోతున్నాను..
- మాధవి కాళ్ల