యువత.. కొక్కరకో…
యువతా మేలుకో…
నీ దేశాన్ని కాపాడుకో..
నీ మార్గాన్ని మార్చుకో
నీ తరాన్ని అర్ధంచేసుకో..
నీ స్త్వైర్యాని పెంచుకో..
దేశ వనరులను వాడుకో..
సొంత లాభం కొంత మానుకో..
వాటిని దేశ ప్రగతికి మలచుకో..
దేశభివృద్ధిలో నీ ప్రేమ ను చాటుకో..
ఓ శక్తి గా మారడం నేర్చుకో..
ఏ దేశమేగినా నీ దేశాన్ని గుర్తుంచుకో..
భరతమాత ముద్దుబిడ్డడు గా మసలుకో..
ఈ దేశం నీదేనన్న భావన అలవరచుకో..
దేశ ఔన్నత్యాన్ని పొగడుకో ..
నిన్ను నువ్వు గెలిపించుకో..
చరిత్ర లో నీ పేరు లిఖించుకో..
మరణించిననూ బ్రతకడం తెలుసుకో…
మంచి మనిషి గా మరణించాలని కోరుకో..
– కిరీటి పుత్ర రామకూరి