న్యాయం
న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టి
ఏది న్యాయము ఏది అన్యాయము
తెలియకుండాపోతుంది…
న్యాయం కోసం ఎదురు చూస్తే వారికి
న్యాయం జరగపోతే న్యాయమా నీవెక్కడ
అని వాళ్ల గుండెలు పగిలేలా అరుస్తున్నారు…
న్యాయ దేవతకి కళ్ళు ముసినంత మాత్రాన
అందరికి అబద్ధాన్ని నిజం అని తేల్చి చెప్పుతున్నారు…
న్యాయం కోసం పోరాటం చేస్తున్నంత కాలం
నిజం అనేది అందరికి చెప్పడానికి ఆధారాలు,
సాక్షాలు కావాలి…
వాటిని సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు, సాహసాలు చేయాలి…
హంతకులకు దొరికితే ప్రాణం పోయే ప్రమాదం ఉంది..
జాగ్రత్తగా ఆధారాలు, సాక్షాలు సంపాదించి
దోషులను శిక్ష పడేలా చేశాను..
ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అనే నమ్మకం ఉంది…
న్యాయం కావాలి అన్న వాళ్లకి న్యాయం జరిగింది…
- మాధవి కాళ్ల