కన్నీటి వీడ్కోలు
మా నాన్నమ్మ గారు హఠాత్తు మరణం వల్ల
మాలో కలిగిన బాధ ఎప్పటికీ మర్చిపోలేనిది…
మేము అశ్రువులతో నీరాజనం సమర్పించాము..
నాన్నమ్మ తో గడిపిన రోజులు గుర్తు చేసుకొని
నాలో బాధ ఎక్కువ అయింది…
మా నాన్న కళ్ళలో ఎప్పుడు చూడని కన్నీళ్లు
నేను మొదటి సారి చూశాను…
నాన్నమ్మ మా మధ్య లేదు అనే విషయం
గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆగడం లేదు…
మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను…
కన్నీటితో వీడ్కోలు సమర్పించాము..
- మాధవి కాళ్ల