నీరాజనం
మా తమ్ముడు సర్వే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు. తనకు వయసు చిన్నదే కాబట్టి అక్కడ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళల్లో ఉన్న తన వయసు వారు తొందరగానే ఫ్రెండ్స్ అయ్యారు. పని ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రికి రావడం ఆలస్యం అయితే వారి గది లోనే ఉంటూ ఉండేవాడు. అలా మా తమ్ముడికి వారికి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఈ లోపు కరోనా రావడం వల్ల ఇక అటే ఉండాల్సి వచ్చింది. దాంతో తన ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయినా ఒక వ్యక్తి గది లో అతను, నా గది లో ఉండన్న మేము ఎప్పుడూ ఉండం. అప్పుడప్పుడు వస్తాము అంటూ తమ్ముణ్ణి ఆ గది వాడుకొమ్మని అన్నారు. అంటే సగం గది అద్దె కట్టుకునే విధంగా మాట్లాడుకుని ఉన్నాడు.
అలా ఉంటున్నప్పుడు వాళ్ళు చాలా దగ్గర అయ్యారు. జోక్స్ వేసుకుంటూ, వండుకుని తింటూ ఇలా బాగా దగ్గర అయ్యారు. అందులో ఒకతనికి పెళ్లి అయ్యి పిల్లులు ఉన్నారు. అతను అప్పుడప్పుడు వస్తూ తనతో బాగా దగ్గరై అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని తెలిసాక తమ్ముడు చాలా మందుల పేర్లు తెలుసుకుని అతనికి చెప్పడం, అతను వాడడం జరిగింది.
తర్వాత కరోనా అయ్యాక తమ్ముడికి వేరే చోటు కు ట్రాన్స్ఫర్ అయ్యింది. దాంతో ఆ గది ఖాళీ చేసి మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేశాడు. రోజూ ఇక్కడి నుండి ఆఫీస్ కి వెళ్లేవాడు. అయితే కాస్త సమయంలో వాళ్ళు రోజూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవారు. తర్వాత తర్వాత ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా వారు మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఈ లోపు అతనికి ఇంకా ఆరోగ్య సమస్యలు పెరిగి, చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. అప్పుడు తమ్ముడు మాకు చెప్పాడు. ఇలా ఒకతను ఉన్నాడు అంటూ అన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ విన్న మేము అయ్యో పాపం అనడం తప్ప ఏమీ చేస్తాం చెప్పండి.
అలా రోజులు గడిచేకొద్దీ మా జీవితాల్లో మేము బిజీ అయ్యాము. మాకు ఏవేవో సమస్యలు చుట్టు ముట్టి ఉక్కిరబిక్కిరై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయం లో తమ్ముడు తనకు దూరం అవుతుంది అని రెండు రోజులు అక్కడే ఉంటూ మూడో రోజు ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నాడు. మొన్న అంటే పోయిన వారం కూడా సోమవారం వెళ్లి డ్యూటీ చేసుకుని, నిన్న రాత్రి వచ్చాడు. అందరం రాత్రి తిని పడుకున్నాం. ఈ రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి తమ్ముడు అదోలా ఉన్నాడు. ఎప్పుడూ రాగానే జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉండేవాడు అలా ఉండేసరికి ఏమైందంటూ అడిగాను.
అప్పుడు చెప్పాడు తను చెప్పిన వ్యక్తి ఈరోజు పొద్దున్నే చనిపోయాడు అంట, అతనికి ఆరోగ్య సమస్యలు ఎక్కువై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు అని. అయ్యో అవునా మరెలా అనుకున్నాం. వాడికి వెళ్లాలని ఉంది లోపల కానీ తోడుగా ఎవరూ లేరు. ఈ లోపు వస్తున్నారా సర్ అంటూ ఫోన్స్ రావడం, అవి మాట్లాడడం తో సమయం 12 అయ్యింది. యింతలో ఎవరో సర్ ఫోన్ చేసి నేను వస్తున్నా ఇద్దరం కలిసి వెళ్దాం అని అనడంతో వాడు మీరేమంటారు అని మనల్ని అడిగాడు.
దానికి మేము అతను నీకెంతో సహాయం చేశాడు. నీకు నచ్చినట్టు చెయ్యి. మనిషి పోతే మళ్లీ చూడలేం కాబట్టి వెళ్ళమని చెప్పాము. దాంతో తను వెళ్ళాడు. పాపం అతని కుటుంబాన్ని తల్చుకుంటే బాధ గా అనిపించింది. అందుకే అతనికి ఇలా అక్షర నివాళి అర్పిస్తూ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
– భవ్య చారు