ప్రియురాలు ఆలిగితే
నువ్వు నా మీద కోపంతో వెళ్ళిపోతుండగా
నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తూతుంటే
నిన్ను పదిలంగా చూసుకోవాలని అనుకుంటూ
నిన్ను ఎన్నో రకాలగా బుజ్జగించాను..
నువ్వు నా మాట వినకుండా
అలా అలిగితే నువ్వు వెళ్లిపోతే
నేను ఏదో సరదాగా చెప్పాను…
నువ్వు మాట్లాడకపోతే నాకు ఏమి తోచదే
ప్లీజ్ బంగారం నీ అలక వదిలి
నాతో మాట్లాడు…
నీ మౌనంతో నాకు నరకం కనిపిస్తుంది..
నీ మౌనం అనే సంద్రంలో నేను కొట్టుకుపోతున్నా
నీ అలక అనే పానుపు మీద నువ్వు నిద్రపోతున్నావు…
నా ప్రియురాలు అలగ ఎప్పుడు వదులుతుందో
నా ప్రియురాలు అలిగితే బుజ్జగించడం
నా వల్ల కావడం లేదు..
– మాధవి కాళ్ల