మార్పు

మార్పు

అనుకోకుండా ఒకరోజు
నాలోని కవిత్వం పత్రికలో ముద్రితమైతే!…
అనుకోకుండా ఒకరోజు
ఆ పత్రిక నువ్వ తిరగేస్తే!..
అనుకోకుండా ఒకరోజు
భావాలు నీ మనసుని తాకితే!…
దొంగకు బంగారం దొరికి నట్లే
వేటగాడి ఆహారం దొరికినట్లే
గాలంలో చేపలు పడినట్లే
అనుకోకుండా ఒకరోజు
ఆ కవిత్వం నుండి ప్రేరణ పొందితే!…
అనుకోకుండా ఒకరోజు
ప్రేరణ ఆచరణలో పెడితే!…
అనుకోకుండా ఒకరోజు
మునుపటి కన్నా ఉత్తమం అనిపిస్తే!….
ప్రపంచానికి నువ్వు పరిచయం అయినట్లే
నీ వాళ్లకు నువ్వు దగ్గరైనట్లే
విజయకేతనం ఎగర వేసినట్లే

– హనుమంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *