అనుకోకుండా ఒక రోజు
పిల్లగాలి చల్లగా వీస్తుంటే… ఆమె కురులు ఆ కారు మబ్బులను తలపిస్తుంటే… ఆమె కళ్ళు సంద్రానికి…. అసలేమీ తక్కువ కాదు అన్నట్టుగా…. వర్షిస్తున్నాయి… అప్పుడు ఎక్కడినుండి వచ్చాడో తెలీదు కానీ ఆరు అడుగుల ఆజానుబాహుడు… చక్కటి మేని ఛాయతో… కత్తుల లాంటి కళ్ళతో.. ఆమె ఎదురుగా వచ్చి నిల్చున్నాడు….
అతడిని చూసి ఆమె కళ్లు… రెప్ప వేయడం కూడా మర్చిపోయి.. అతడినే చూస్తున్నాయి… రెప్ప వేస్తే అతను మళ్ళీ ఆమెను వంటరిని చేస్తాడేమో అని…. అతను ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణ తెలుసుకున్నవాడు వలె ఆమెను అతని కౌగిల్లో బంధించి… ఆమెకు నేను ఉన్నా అన్న దైర్యన్ని ఇచ్చాడు…. అలా వాళ్ళిద్దరూ… ఈలోకంతో సంబంధం లేకుండా ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు…..
ఆమె పేరు అంజలి
అతని పేరు అక్షిత్
ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు గా కలిసి మెలిసి పెరిగారు…పై చదువులు కోసం అక్షిత్ టౌన్ వెళ్ళవలసి వచ్చింది… ఈ విషయం తెలియని అంజలి…. అతని కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళింది… ఆమె వెళ్ళేసరికి అతను వెళ్ళిపోయాడు అని తెలుసుకుని గుండె పగిలేలా విలపించింది… అప్పుడు తెలుసుకుంది ఆమె అది స్నేహం కాదు ప్రేమ అని…
అతని కోసం ఎదురు చూస్తూ కాలాన్ని వెచ్చించింది…. అనుకోకుండా ఒక రోజు అతను ఊరు వచ్చాడు అని తెలుసుకుని అతని కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళింది… కానీ అతను వేరే ఆమెతో కలిసి మాట్లాడుతున్నాడు…. ఆ అమ్మాయి ఆ దృశ్యాన్ని చూసి మరింతగా బాధ పడిపోయింది… చాలా ఏడ్చింది… తరువాత ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు… ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని మర్చిపోడానికి చాలా విధాలుగా ప్రయత్నించింది…
ఎంత ప్రయతనించినా ఫలితం శూన్యంగా ఉండేది… ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి… అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు…. అలా ఏదోఒక సాకు చెప్పి తప్పించేది… అతనిని మరువలేక వెరేవాడిని కట్టుకొలేక… తనలో తానె మధన పడుతూ…. అలా ఆమె ఇంటి డాబా ఎక్కి ఊరు అందాలను చూస్తూ…. అతడితో గడిపిన బాల్యం ఆమె కళ్ళ ముందు మెదిలేసరికి.. ఆమె మరింత బాధ పడిపోయింది…. చల్లని గాలి కబుర్లు చెబుతున్నట్టు.. అనిపించి అటు వైపు చూసేసరికి… అతను ఆమెను గమనిస్తూ ఉన్నాడు….
అలా పై చదువులు కోసం వెళ్ళినా కూడా ఆమెను మర్చిపోలేక… ఆమెను కలుసుకోవాలని తపనతో అతను ఆమెకోసం సడెన్ గా వచ్చి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు….
– మేఘమాల