పరమానందం
ఆనందం అను మూడు అక్షరాలు
వింటే మనసుకి ఆనందం కలుగుతుంది.
ఒక అద్భుతమైన మనో భావానికి అక్షర
రూప కల్పన చేసి, ఒక భాషని సృష్టించి ఒక
అందమైన మాటగ కూర్చి ఆ శబ్దమును
వీనువిందుగ వినిపించిన మహాను భావులకి
వందనాలు.
జగద్గురు ఆదిశంకరచార్యులు జగన్మాతను
స్తుతించిన అపూర్వ గ్గ్రంధం
“సౌందర్యలహరి”లో నలుబదిశ్లోకములు
“ఆనందలహరి “యని ఏబది తొమ్మిది
శ్లోకములు సౌందర్య లహరి అని
చెప్పబడినది.
ఆవలింతకు అన్నయ్య వున్నాడు, కాని
తుమ్ముకు తుమ్ముడు లేడని ఒక సామెత.
కాని సుఖ దుఃఖాలులు బద్ధ విరోధులు.కాని
ఒకరిపక్క ఒకరు చెట్టపట్టాలే సుకొని
తిరుగుతుంటారు.వెలుగు చీకట్లలాగా.
సుఖం పక్క దుఃఖం.దుఃఖం పక్క సుఖం.
ఇవన్నీ మానసిక అనుభవాలె.
జీవితంలో ఇవన్నీ సహజమే అనుకొని
మనం ఆనందంగా ఉండగలిగితే
ఆనంద బాష్పాలు, కన్నీళ్లు ఏకమై ద్వివేణి
సంగమై దానికి భక్తి రసం జోడిస్తే త్రి వేణి
సంగమంగా మారి మనసు పరవళ్లు
తొక్కుతూ,మానసిక సౌందర్యంతో జీవితం
పరమానంద భరితమౌతుంది.
– రమణ బొమ్మకంటి