మానసిక ఆనందం
యత్ భావం తత్ భవతి
అనేది మనలోని భావన మాత్రమే మనిషిని సంస్క
రిస్తుంది.
మన భావాస్వాధన వుంటే
పీల్చే గాలి కూడా ఆనందం
చూసే కంటి కి తెలుసు ఏమి
అనుభూతి చెందుతావో
అదే మహదానందం
వినే చెవులకు తెలుసు
ఎలాంటి మాటలు నీకు
ఆనందానికిసరిపోతాయో
మాట్లాడే భాష నిన్ను ఎలా
ఆనందంలో ముంచుతుందో
చేసే పనిలో దైవత్వం
వెతికితే మనసుకు తృప్తి
ఇస్తుందో
ఇతరులకు ఇబ్బంది కలుగకుండా నడుచుకుంటే
అదే గొప్ప అత్యానందo
ఆట పాటల్లో మునిగితే
అదోరకం మనోనందం
అవసరానికి సాయపడితే
అధికమైన ఆనందం
మనకు మనంగా మై మరచి
జీవిస్తే బ్రహ్మానందం
అది ఎప్పుడూ మనతో వుండే మానసిక ఆరోగ్యం
ఆనందం……?
– జి జయ