జవాన్
జవాన్ అంటే :
ధైర్యమే ఊపిరి
రక్షణే ధ్యేయం
సేవనే ప్రతి క్షణం
ఊహించని పరిస్థితులు
అదృష్టమే అంచులు
బరోసా నే బంధువు
ఆకాశమే హద్దులు
చేదించే వ్యూహాలు
ఎదురుగా తూటాలు
సాహసమే సన్నిధి
యుద్ద క్షేత్రమే స్థానము
రక్షణే తంత్రము
అభిమాన మే కష్టము
గుండెనిండా నిబ్బరం
రేయి పగలు తోడుగా
ప్రాణమే పణంగా
మరణమే మంత్రము
సరిహద్దులు సాక్షాలు
సన్నిహితులే సహకారం
రక్తమే ధీరత్వం
త్యాగాలే పాఠాలు
భానుడే ఆశా కిరణం
మంచుగడ్డ లే మాయని
వస్త్రాలు
దేశభక్తి గీటురాయి
వెలకట్టలేని దేశసేవ
కత్తిమీద సాములా
జీవితాన్నే మాతృ దేశం
కోసం తృణప్రాయంగా
విడిచేది జవాన్ ఒక్కడే
ఒక్కడే ………
జై జవాన్ జై జవాన్
– జి జయ