మా ఊరి పండగ
అందమైన మా ఊరి లో
వసంతం లో హోలి అంటూ
కల్మ షాలు లేని
అందరోక్కటిగా ఆడు కునే
రంగుల పండగ
ఉట్టి మీద పెరుగు తిని
ఊరంతా తిరిగి తిరిగి
ఊరి బయట మోదుగు చెట్టు
బడిడారిన వెదురు బొంగు
సమకూరిన పరికరం
సంతసించిన మది
కొసుకొచ్చిన పువ్వులు
కోరిచేసిన రంగులు
పన్నీటి జల్లులు కాదు
మరిగించిన కాషాయ
నీళ్ళు
లోటల్లో నింపుకుని
ఉరికి ఉరికి చల్లుకొని
బావిలోని నీళ్ళు లేదంటే
పేడ ముద్దలు
అమ్మ ఆజ్ఞ వరకే
ఆడిన రోజులూ
మధురమైన భక్ష్యా లు
మా కోక్కటి అనుకుంటూ
మరునాడు బడికెళ్లి న
రంగు ముఖం అదే
ఆనందపు అనుభూతి …
– జి జయ