నీరజ
చందమామ లాంటి నగుమోము కలిగి
విశాలమైన నుదురు భాగముతో ఆకర్షించే నయనాలతో సన్నని
పొడవాటి ముక్కుతో
తమలపాకు లాంటి
పెదవులతో చిరునవ్వు చిందిస్తూ
అతి సుందరమైన సుకుమారమైన చర్మం కలిగి
చామన చాయ రంగుతో
ఒత్తయిన నల్లని తుమ్మెదల వంటి
కురులతో శుక్రవారం తలంటుకొని వాలు జడ
వేసుకొని తన సన్నని నడుము వంపుతో
వయ్యారాల హంస నడకతో నడిచి వస్తూ ఉంటే
ఇటు అటు మెలికలతో ఉయ్యాలలుగుతున్న
ఆ వయ్యారి వాలు జడను
చూసిన వారి చూపులు ఆ
జడ పై పడి వీనుల విందు చేస్తుండెను
ఐదు పదుల వయసు దాటిన అదే అందచందం చెక్కు
చెదరని వాలు జడ
ఆమె సొంతం ఆమె నీరజ అమ్మవారి స్వరూపం.🙏
-బేతి మాధవి లత