వలపు వీణ
మగువ మనసు తెలిపే వాలుజడ
మగని చుట్టుకొని వగలుపోయే జడ
నడుము వంపులోన నయాగారమే ఈజడ
అటుఇటు ఊగుతూ కుర్రకారు మది కొల్లగొట్టే జడ
వయ్యారి హంస నడకలోన హొయలుపోయేనట
భుజంగమై బుసలుకొట్టు నాగుబాము జడ
విసవిస విసురుల విలాపమొందేనట
రుసరుస విరుపుల కొనంగి కొంటె జడ
విసురుగవచ్చి తాకిన మగడు ముదమున చేరునట
నది నడకల నాగస్వరమే ఈజడ
కులుకులతో వలవేసే వయ్యారి వాలుజడ
విరుల కురుల తెలుపుగ తరమా ఈజడ చిత్రం
కుంచె కందని బహు విచిత్రం
-వింజరపు శిరీష