ప్రకృతి సోయగాలు
వర్ణాలన్ని ఒకే చోట చేరి అరవిరిసిన అందాలతో శోభాయమానంగా శోబిల్లే
ప్రకృతి ఒడిలో పూల సోయగాలు నేలపై తివాచీ పరచి ఆహ్వానం పలికే…
నయననందమై కనువిందు చేస్తూ మదిని ఉల్లాసపరుస్తూ పరవశింప చేస్తూ…
చల్లని సమీరాన్ని స్వాగతిస్తూ అందరిని పలకరిస్తూ…
చిగురించిన పత్రాల పులకింతలు నాట్యమడగా
తుమ్మెదల ఝంకారనాదం
మోగగా…
పుడమికి పచ్చని శోభను సంతరించుకొని నడయాడే దృశ్యమాలిక కడు రమణీయం….
కొత్తప్రియాంక(భానుప్రియ)