మహాద్భుతం

మహాద్భుతం

నా జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అసలు ఏమి జరిగిందంటే ఇరవై ఆరు ఏళ్ళ క్రితం నేను ఒక హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేటు సంస్ధలో పనిచేస్తుండగా ఒక వ్యక్తి నన్ను కలిసారు. ఆయనఒక సాధువు. ఆయన కాషాయ రంగు బట్టలు వేసుకున్నారు.

ఆయనని కలిసే నాటికి నాకు పెళ్ళి జరగలేదు. సాయంత్రం ఒక మెస్ లో భోంచేసి రూంకి వెళుతుండగా ఆ సాధువు కలిసాడు. అతను నన్నేమీ ఆపలేదు. నేనే ఆయన్ని ఆపాను. ఆయనకి నమస్కారం పెట్టి “భోజనం చేసారా స్వామీ”అన్నాను. ఆయన నవ్వాడు.

సాధువు కాబట్టి పండ్లు తింటారు కాబట్టి నా దగ్గరఉన్న అరటిపండ్లు ఇచ్చాను.ఆయన మళ్ళీ నవ్వాడు.అలా వెళ్తూ ఆయన ఒకవిషయం చెప్పాడు.

ఆయన “నీకు వచ్చే సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. వివాహం జరిగాకనువ్వు గురువుగా స్ధిర పడతావు” అన్నాడు. అప్పటికినాకు టీచర్ గా చెయ్యాలని ఆలోచన లేదు. అలా అని ఆయన వడివడిగా వెళ్ళటం
మొదలుపెట్టారు.

నాకు కుతూహలం కలిగి ఆయన వెంటే నడవసాగాను. ఆయనవెనక్కి తిరిగి మళ్ళీ ఒక మాటఅన్నాడు. “నీ కధ ఇన్ని సంవత్సరాలకు ముగుస్తుంది” ఇప్పుడు అందరికీ ఆ సంవత్సరం ఏమిటో చెప్పను. నేను కూడా ఆయన చెప్పినసంవత్సరం మర్చిపోవాలనేప్రయత్నం చేస్తున్నాను.

ఆయన చెప్పిన విధంగానేజరిగింది. ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఆయనచెప్పిన విధంగానే వివాహం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే టీచర్ జాబ్ చేస్తున్నాను. అదొక
అద్భుతంగా అనిపిస్తుంది.

ఇప్పుడు తలచుకుంటే శరీరం గగుర్పాటుకు గురి అవుతుంది. ఇప్పటికీ ఎవరైనా సాధువులు ఎదురైతే వారినిపరీక్షగా చూస్తాను. నాకు ఆసాధువు మళ్ళీ కనపడలేదు.ఆయన నాకు చెప్పిన నా కధముగిసే సంవత్సరం ఎప్పుడోమరిచిపోయే ప్రయత్నంలో ఉన్నాను.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *