దినాన్ని ఓడిపోకు…!!!
యుగమెంతటిదో చూడక పోయినా
నేర్చిన ప్రత్యక్ష భావనలకు రూపమై
నిలిచి రేపటి సమాజ నిర్మణం కోసం
మనిషిగా ప్రయత్నాన్ని పురమాయించు
అంతమొందకు చింతన చేయకు
ఆశయాల చేతనని విధిగా కూల్చేయకు
నీలో ఆంతరంగిక సముదాయానికి
వేదికవై జ్ఞాన ప్రవాహపు తడి దొరికే
వరకు తరుణం వాలిపోయినా తత్త్వం
మార్చుకోక నిరంతరమై తపించు…
ఆశల విరుగుడులకు లోకమై
పూయదు పెనుబారాలతో దిగుడు
బడని కరుకుగా చావని కోరికలతో
బలపడాలని చూడకు…
ఆస్వాధించే మనస్సు లేనప్పుడు…
చూచిన ప్రతిది సుడిగుండపు
ప్రయాణాలతో పాతాళానికి చేరేదేనని
తెలుసుకో…
వెదకని తీరం దొరకక పోయినా
సాయపడే సాక్ష్యాలు కనిపించకపోయి
నీలో సోధనలు ఒంటరైన వేళ…
జ్ఞాపకాల తీర్పులను మరిచిపోలేక
ముక్త కంఠంతో అనుదినాన్ని ఘోషిస్తు…
కీర్తింపుబడని పథాకంగా కూలిపోకు…
విశాల సముదాయంలో
ప్రతి ప్రాణం పుట్టుక ప్రాపంచిక
కారణాలకు ప్రతి రూపమై నిలిచేవే…
నిజం దాగదు దాగుడు మూతలతో
వెలుగును మూయలేవు…
దాపురించిన చీకటి నిర్వచనం కాలేదు…
చదరంగమై క్షణాల ఎత్తులతో కదులుతు
సాంద్రతల సామర్థ్యాలు చేయనివిగా
దినాన్ని ఓడిపోకు…
దేరంగుల భైరవ