అడవి తగలడిపోతోంది.
పర్వతమంతా పచ్చనిచెట్లే.
చెట్లపైనెన్నో రంగుల పూలు.
చూట్టూ అంతా కీకారణ్యం.
అడవిలోని సుందర పక్షులకు, జంతువులకదే నివాస ప్రాంతం.
సుందర ప్రకృతికి చిరునామా.
అది చీమలు దూరని చిట్టడవి.
అది కాకులు దూరని కారడవి.
అందులోకి మనిషి ప్రవేశించి
తన స్ధలం కోసం అగ్గి పెట్టాడు.
చెట్లన్నీ కాలిపోతున్నాయి.
జీవులన్నీ పారిపోతున్నాయి.
మంటలు ఎగసిపడుతున్నాయి
ప్రకృతేమో కన్నీరు పెడుతోంది.
అడవి అంతా తగలడిపోతోంది.
మనిషి స్వార్ధమే గెలిచింది.
ప్రకృతికేమో కోపం వచ్చింది.
మనిషి ఆ ప్రకృతి కోపాన్ని తట్టుకోలేడేమో.
వెంకట భానుప్రసాద్ చలసాని