యువత
మా పిల్లలు బాగా చదివి ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో శక్తి లేకపోయినా కానీ అప్పు చేసైనా ఖరీదైన స్కూల్ కాలేజ్ లో చేర్పించిఏ కష్టం కలగకుండా ఏసి వసతి గృహాలలో ఉంచి చదివిస్తూ కాస్త ఆలస్యమైతే అక్కడున్న వాళ్లకు అసౌకర్యం కలిగి ఏ ఇబ్బంది పడతారో ఏమో? నని కన్నవారి కష్టం అక్కడున్న వాళ్లకు తెలియనీయక నెల నాడు డబ్బులు పంపిస్తూ ఉంటే.!!
అవసరానికి ఒక వంతు ఖర్చు ఉంటే వాళ్లు భోగాలు అనుభవించడానికి మరో రెండు వంతులు వసూలు చేస్తూ పెద్దవారు పక్కన లేక స్వేచ్ఛగా తిరుగుతూ ఆడ మగ తేడా లేకుండా వావి వరసలు మరిచిపోయి పూర్తిగా దిగజారిపోయి మద్యానికి బానిసలు అవుతూ గీతలు దాటిన యువతకోరి కష్టాలు కొని తెచ్చుకొనిచివరకు నష్టాల పాలవుతుంది.
– బేతి మాధవి లత