యాత్రా స్థలం
హైదరాబాద్ లో నచ్చిన ప్లేసులంటే చాలానే ఉంటాయి..
ఒకప్పుడు మేం వేరే ఊర్లో ఉండేవాళ్లం అప్పుడప్పుడు మా బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక ప్లేస్ చూసి వెళ్లాలని వెళ్లేవాళ్లం అలా అప్పుడు అన్నీ చూసాం! కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం! అందుకే ఎటు వెళ్లాలన్నా ఇంట్రస్టు తక్కువే అయింది..
ఇక ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాం! ఇప్పుడంతా హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న యాత్రా స్థలాలకు ఎక్కువగా వెళ్తున్నాం!
ఏంటి మీరు? నచ్చిన ప్లేస్ రాయమంటె ఈ సోదంతా రాస్తున్నారు అంటున్నారా??
అంటారు మరి అనరా ఏంటి? అసలు సంగతి వదిలేస్తే!
హా…ఇక చెప్పేస్తున్నా!
ఒకప్పుడైతే బిర్లా టెంపుల్,శిల్పారామం నచ్చుతుండె..
ఇప్పుడింకా చాలా కొత్త కొత్తవి వచ్చాయి కదా!
మెున్ననే చూసిన థ్రిల్ సిటీ బాగానె నచ్చిందండి..
-ఉమాదేవి ఎర్రం