యదార్ధాలు గ్రహించాలి
గతించిన కాలం తిరిగిరాదు
అనే యదార్ధాన్ని గ్రహించాలి.
భవిష్యత్తు మన చేతిలో లేదు
అనే యదార్ధాన్ని గ్రహించాలి.
వర్తమానంలో చేయాల్సినవన్నీ
చేసేందుకు ప్రయత్నం చేయాలి.
కృషి చేయడం మానవ ధర్మం.
కృషి చేయాలి నిరంతరం.
ఈ సంగతి గ్రహిస్తే మనందరం
అయ్యేను భవిష్యత్తు నందనం.
సమాజానికి ఏదో ఒక మేలు
చేసెయ్యాలి మనందరం.
రచనలద్వారా రచయితలంతా
ప్రజలకు ప్రేరణ కలిగించాలి.
జీవితంలో ముందడుగు వేసే
ఉత్సాహాన్ని వారిలో నింపాలి.
గమనించాల్సిన విషయాలెన్నో
నీ చుట్టూ జరిగిపోతున్నాయి.
వాటి నుంచి నేర్చుకోవాల్సిన
పాఠాలు మనముందున్నాయి.
కష్టాలెప్పుడూ ఉండిపోవు
సుఖాలు కూడా వస్తాయి.
ఈ సంగతి గ్రహిస్తే మనం.
మనశ్శాంతి లభించేను
జీవితకాలం.
-వెంకట భానుప్రసాద్ చలసాని
యదార్ధాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.