వ్యధ

వ్యధ

కలగంటినే….
బడుగుజీవుల రాత మారెనని
అనాధ బతుకులు చెదిరెనని
రైతుల పాలిట ప్రభుత్వం దైవమని
కార్మికుల శ్రమ వృథాకాదని

స్త్రీమూర్తి కిర్తింప బడునని
ఆలయమున దైవం కలదని
నరపీడిత సమాజం నలిగేనని
భువిపై స్వర్గం కొలువైనదని

సంద్రమునైనా ఈదేదనని
చీకట్లో వెలుగు నింపేనని
తెగిన రెక్కలు కూర్చేదనని
నింగినినైనా తాకేదనని

కలమున సిరానై పారేదనని
కవిత్వమున కవిత్రయమని
కళలు వెలుగొందే నలువైపులని
అజ్ఞానమనే అందకారం తోలిగేనని

కరిగెనే కలలు
కన్నీటి కార్చిచ్చుకు
కలలు కంటినే
కార్యము తలపెట్టక.

– హనుమంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *