వృత్తి ధర్మం
ప్రతి ఒక్కరూ ఉదరపోషణార్ధంపనిచేస్తారు. పండితుడైనా, పామరుడైనా సంపాదన కోసంరకరకాల వృత్తులు చేపడుతూ
ఉంటారు.
వెంకట్ కూడా టీచర్ఉద్యోగం చేస్తున్నాడు. గత ఇరవై సంవత్సరాలుగా అదేవృత్తిలో ఉన్నారు. అయితేఅతని ఇంటి పక్కనే ఉన్నఇళ్ళల్లో ప్రసాద్, శ్రీను కూడాఉండేవారు. ప్రసాద్ కార్పెంటర్,శ్రీను మాత్రం పెయింటర్.
అలాఆ ముగ్గురూ తమ వృత్తులను చేసుకుంటూ వారి కుటుంబాలను చక్కగా పోషించుకుంటూ ఉండేవారు.అయితే వెంకట్ కు ఒక అసంతృప్తి ఉండేది.
గతఇరవై ఏళ్ళ నుండి టీచరుగా పనిచేస్తూ ఉన్నా అతని జీతంనెలకు ముప్ఫై వేల రూపాయలు దాటలేదు. మరి కార్పెంటర్ ప్రసాదు రోజుకుపదిహేను వందలు సంపాదిస్తూఉన్నాడు.
అలాగే పెయింటర్ శ్రీను కూడా రోజుకు పదిహేను వందలు సంపాదించుకుంటూ ఉన్నాడు. ఇంత చదువుకున్నతనకు మేస్త్రీ కూలీ కూడారాకపోవటం బాధాకరంగా ఉంది వెంకట్ కు.
ఒకసారిమాటల సందర్భంగా ఇదే విషయాన్ని ప్రసాదుకి, శ్రీనుకిచెప్పుకుని బాధపడ్డాడు. అప్పుడు ప్రసాదు”మీరు
ఎందుకు బాధపడతారు.
ఉపాధ్యాయ వృత్తి అనేది గౌరవప్రదమైన వృత్తి. మీచేతిలో దేశ భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటేనేటి బాలలే రేపటి పౌరులుకాబట్టి. డబ్బులు తక్కువవస్తున్నాయి అని అసంతృప్తిఎందుకండీ. సమాజంలో మీకు లభించే గౌరవం గురించి
ఒకసారి ఆలోచించండి. మాకు ఒకోసారి ప్రతిరోజూ పనిదొరకదు. ఆ రోజు మేముచాలా బాధపడతాము” అన్నాడు. అప్పుడు
శ్రీను ” అవును మాష్టారు,ఎవరి వృత్తి పట్ల వారునిబద్ధతతో ఉండాలి.
అంతేకానీఅసంతృప్తి ఉండకూడదు” అన్నాడు వెంకట్ తో. అలా ఆ సంభాషణ ముగిసింది.వెంకట్ ఆలోచనలో పడ్డాడు.
ఇప్పటివరకు తనకు వచ్చే డబ్బులు చాలా తక్కువఅని ఆలోచిస్తూ బాధ పడుతూఉన్నాడు వెంకట్.
ప్రసాద్, శ్రీను చెప్పిన మాటలు అక్షర సత్యాలు అని అతని మనసు చెపుతోంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని