ఓటు మా హక్కు
తొలి ఎన్నికల నుంచే
ఓటు హక్కు
వినియోగించుకున్న
భారతీయ మహిళకి
మగమధాందుల ధాటికి
హింసను ఎదుర్కొంటూ
భద్రత విషయంలో
అరిటాకు ముల్లు సామెత
ఏ మాత్రం మారలేదు..!!
పల్లె చిత్రం ఏమో ఓటు కోసమాయే
నవ్వుల జల్లులకి రాలిపోయే బతుకులాయే
ఏది జాడ ఏముంది మా నీడ
ఓటు కోసమే నవ్వుల సిత్రం మావి
తరువాత ఏ దిక్కుకు పోతామో
ఎవరికీ తెలుసు..!!
తడి ఆరిన జీవితాలా వెనుక
ఓటు ఉంటుందేమో కానీ
ఆ ఓటు కోసం వచ్చే రాజకీయ
సన్యాసులు మాత్రం మా కట్టాలు
మారుస్తారన్న నమ్మకం
అయితే లేదు సారు..!!
రాటుదేలిన సమాజంలో
ఓటుకే పోటు
ఓటు దాటుతుంది
మానవత్వపు గేటు..!!
అరాచక పాలనతో
అభివృద్ధికే వేటు
దేశానికి అదే సిగ్గుచేటు.
వాస్తవాల్ని గుర్తించు
ఓటును పెట్టొద్దు తాకట్టు..!!
రాజ్యాంగాన్ని అమ్ముల పొదిలో
పెట్టుకొని ఓటు అనే బ్యాంకుతో
దాచుకోగలం గాని
మనం వేసే చూపుడు వేలు పైన
సిరా చుక్క “ఓటు మా హక్కు”
అని జీవితాల్నే మార్చేయగలం..!!
–పోతగాని శ్యామ్ కుమార్