ఓటే మిగిలింది – అభివృద్ధి అందనంది
ఓటు సామాన్యుడి హక్కు
కర్కశులై ప్రజాస్వామ్యాన్ని
పాతరేస్తున్న నాయకులకు
రోకటిపోటు
ప్రలోభాలకు లోనుకాకు
నోట్లకోసం ఓటును అమ్ముకోకు
ప్రగతి మార్గాన్ని మరీచిక చేయకు
నైతికతను కోల్పోకు
అభివృద్ధి ఫలాలను త్రుంచేయకు
భావి తరాల భవితను బూడిద చేయకు
ఓటుతో అవినీతిని ఎదిరించు
అందలాలలో ఆదమరచి
అధికారాన్ని అనుభవించే
అవినీతి నాయకులను
అవనికి దించి మదాన్ని
మధించి మార్పుకు
శ్రీకారం చుట్టు
-గంగాధర్ కొల్లేపర