వివాదస్పదమైన స్నేహం
చిన్నప్పటి సంగతి చెప్తున్నానని నవ్వుకోకండి..ఏదో గుర్తొచ్చిందలా! కొన్ని సంఘటనలు మనం మరిచిపోదామన్నా మరుపు రావు పైగా ఇప్పుడే జరిగినట్టు మనసలో మెదులుతాయి..
నేను మా వాణి వసుధ ముగ్గురం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మి ఆరవ తరగతి నుండి ఇప్పటి వరకు మా స్నేహం
సాగుతూనే ఉంది..
అయితే ఎనిమిది నుండి పదో తరగతి వరకు మేముపోట్లాడు కునే వాళ్లం..ఆరు నుండి అంతగా గుర్తు లేదు. కానీ ఎనిమిది నుండైతే చాలా గుర్తు..పోట్లాడు కున్నాక మాట్లాడుకోక పోయే వాళ్లం..
అప్పుడు చిట్టీల మీద రాసుకునే వాళ్ళం..ఎక్కువగా మా వాణి నేనే అలా చేసే వాళ్ళం, వసు మాఇద్దరికీ చెప్పలేక పరేషాన్ అయ్యేది..అలా రాసుకుని రాసుకుని మేమిద్దరం రచయిత్రులమేఅయ్యాం!
అదైతే నాకంటే పెద్ద రచయిత్రండోయ్ ఇప్పుడు వరంగల్ లో! మాదారపు వాణిశ్రీ! చాలా పెద్ద రచయిత్రి అయింది..నా మూలంగానె అంటది..మా స్కూల్లో కాలేజ్ లో మమ్మల్ని త్రిమూర్తులు అనిపిలిచే వాళ్ళు…
చిన్న చిన్న వివాదాలున్నా అది చిన్నప్పటిదే!ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది..అదండీ సంగతి..
-ఉమాదేవి ఎర్రం