వివాదాస్పద స్నేహం
ఏయి ఎంటి పిచ్చి పిచ్చిగా ఉందా , నేనేదో పోస్ట్ చేసుకుంటేదానికి నీ పిచ్చి కామెంట్ ఎంటి అంటూ గొడవకు దిగింది తన్మయి.
నేనేం అన్నాను ఉన్న మాటే అన్నాను దానికే నా పై కి గొడవకి వస్తావా అంటూ రెచ్చిపోయాడు వెంకీ .
సిగ్గు లేదు ఆడపిల్ల అని కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అంటూ ఇంకా రెచ్చిపోయి అతని అకౌంట్ నీ బ్లాక్ చేసింది తన్మయి.
ఛీ ఛీ వెధవలు బాగా ముదిరిపోయారు అంటూ తన స్నేహితురాలి తో వెళ్లపోసుకుంది తన్మయి.ఏమైందీ అంటూ అడిగిన స్నేహితురాలి తో
ఈ మధ్యే రిలీజ్ అయిన సినిమా గురించి ఇది రీమేక్ అని అంటే, మీరు రిమేకు లే చూస్తారా, అంటూ ఎద్దేవా చేశారు వెధవ అని చెప్పింది.
అవును అతను అన్న దాంట్లో తప్పేముంది రీ మేక్ లే చూస్తారా అని అడిగాడు, అంతే గా నువ్వే ఏదేదో ఊహించుకున్నావు అంటూ
స్నేహితురాలు అనేసరికి అవును అక్కడ బూతులు ఏమి లేవు గా, అంటూ ఆలోచన లో పడిన తన్మయి అవును బూతు లేదు. జెస్ట్ అడిగాడు. అంతే గా అంటూ బ్లాక్ లోంచి తీసేసింది.
హమ్మయ్య తీసేసారా, అంటూ మెసేజ్ చేశాడు వెంకీ. సమాధానం గా హా అంటూ రిప్లై ఇచ్చేది. నేను జెస్ట్ అడిగాను అండి అంతే చెప్పే లోపు బ్లాక్ చేశారు, మీరు అన్నాడు మళ్లీ హా అంది.
మీకు హా లు తప్ప మాటలు రావా అన్నాడు . ఉడుక్కుంటూ రావు లే, అయినా నీకెందుకు అంటూ అడిగింది.
మరి ఇప్పుడు ఎవరు మాట్లాడారు.
మీకు మాటలు రాకుంటే అన్నాడు. మాటలు రావు కానీ చదువు వస్తుంది కదా, అందుకే టైప్ చేశా అంది సమర్థించు కుంటూ,
ఓహో అమ్మాయి గారికి ఎటకారం ఎక్కువే అన్నాడు వెంకీ . నీకన్న కాదు లే అంటూ రిప్లై ఇచ్చింది
అలా వారి స్నేహము గొడవ నుండి స్నేహంగా,స్నేహం నుండి ప్రేమగా మారడానికి పెద్ద సమయం పట్టలేదు.
కొన్ని రోజులు అయ్యాక ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్నారు. దానికి తగినట్టు గానే. సమయం , డేట్ అన్ని ఫిక్స్ చేసుకున్నారు.
ఎలా గుర్తు పట్టాలి అనేదానికి తాను. యెల్లో కలర్ డ్రెస్ లో వస్తాను అంది తన్మయి.
తాను బ్లాక్ షర్ట్ లో వస్తాను అని చెప్పాడు వెంకీ . ఇద్దరు సరే అంటే సరే అనుకున్నారు.
***
ఇక కలవాల్సిన సమయం ,రోజు రానే వచ్చాయి. అనుకున్నా స్థలానికి చేరుకున్నారు ఇద్దరు. ఫోన్ లో చాట్ చేస్తూనే ఒకరి కొకరు తారస పడ్డారు.
ఒకరి మొహాలు, ఒకరు చూసుకుంటూ నువ్వు, నువ్వు అంటున్నారు. తర్వాత కాసేపటికి తేరుకుని నువ్వు వెంకీ నా? అంది తన్మయి.
హా తమరు తన్మయి మరి? అంటూ ఎద్దేవా చేశారు వెంకీ అనబడే వెంకటేశ్వర రావు ,
తన్మయి అని మారు పేరు పెట్టుకుని మోసం చేస్తావా అంటూ నిలదీశాడు. సదరు తన్మయి అనబడే తామేశ్వరి నీ వెంకటేశ్వర రావు.
అబ్బో అమ్మాయి అనగానే సొల్లు కారుస్తూ, యువకుడి లాగా ప్రేమ ఒలక బోసింది ఎవరో అనుకుంటూ ఇద్దరు అక్కడే గొడవకు దిగారు.
చుట్టూ ప్రక్కల ఉన్న వారంతా వీరిని విచిత్రంగా చూడడం , గుమిగూడి గుసగుసలు పోవడం తో అటు గా వెళ్తున్నా రామేశ్వరం వచ్చి ఎంటా అని చూసాడు..
తన తమ్ముడు, మరదలు అక్కడ పబ్లిక్ లో గొడవ పడడం చూసి ,దగ్గరికి వెళ్ళి అపేసీ మీకేమైనా సిగ్గుందా , బి టెక్ చదివే పిల్లలను పెట్టుకుని, మీకు ఇదేం బుద్ది అంటూ చివాట్లు పెట్టాడు .
తర్వాత వార్ని ఇంటికి తీసుకు వెళ్లి వారి ఫోన్ లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డిలీట్ చేయించి, ఇకనైనా మారి పిల్లలను ఓ కంట కనిపెట్టి చావండి.
మీరేం ప్రేమికులు కాదు.పిల్లల తల్లిదండ్రులు ,కాస్త పెద్ద రికంగా ప్రవర్తించండి అంటూ నీతులు చెప్పి , తనింటికి తాను వెళ్ళాడు.
రామేశ్వరం ఇంట్లో అడుగు పెడుతుండగా తన ఫోన్ కి మెసేజ్ వచ్చింది . ఇంటికి వెళ్ళవా డార్లింగ్ అంటూ , జెస్ట్ ఇప్పుడే రిచ్ అయ్యాను డార్లింగ్.
అంటూ రిప్లై ఇచ్చి లోపలికి వెళ్ళిన రామేశ్వరానికి తన భార్య ఫోన్ పక్కన పెడుతూ కనిపించింది. దాంతో అవాక్కయ్యాడు రామేశ్వరం.
-భవ్యచారు