విసరిన ప్రేతాత్మనై

విసరిన ప్రేతాత్మనై

కూర్చొని ఉన్నా….
మేఘాలు నిండిన మబ్బుల క్రింద
జారుతున్న దినసరి వెలుగులో నాదొక
దిగోలును తొడిగిన ముఖచిత్రమై…నేనని
అంకితభావం లేని ఆశలు స్వార్థభావనతో
వదిలిపోతున్నాయి ఎందుకో తెలియదు…
చుట్టూ చూస్తున్న అవ్యక్తం భోదపడక
ఆవిరై పోతున్నాయి…కొరికల పచ్చధనాలు
సంధ్యలు వందనాలతో ముగుస్తు…పగటి
అలుపును చీకటి దుప్పటితో కప్పెను
మబ్బులను పులిమిన రేయి అమావాస్య
కారు చీకటిగా రూపం దాల్చుతు…మానసిక
భయమేదో మనస్సున గూడు
కట్టుకొంటుంది…..

నా నడకలు కంటికి బరువవుతు….
కనిపించని దారికి నే కఠిణమై ఎక్కడో
దూరాన వినిపిస్తున్న మధి గుర్తించని వింత
అరుపులు దగ్గరికవుతు….నన్ను
అస్వాధిస్తున్నాయి మందగమనపు స్పర్శతో
అరుదైన లోకం నా ఎదుట కనబడుతు
నన్ను ఆహ్వానిస్తున్నది….దేనికోసమో…
ముల్లిరగని గడియారం మౌనమే
అంగీకారమని క్షణమాగనిదే
తన కర్తవ్యమని చెలరేగిన గాలికి దవడలు
పగులుతున్నట్లుగా….ఆధారం లేని ఆక్రందన
చొరబడినట్లుగా శూన్యం లిఖించిన శాసనమై
మబ్బులలో తచ్చాడుతున్న రూపాన్ని…
పసిగట్టిన కుక్కల బెదిరింపులతో
నిలబడిపోయి…నిరాశతో చూస్తున్నది
ఆ కంటి వెలుగులకు అర్థం ఏమిటో
తెలియదు…

దానర్థానికి వివరణ ఆకారంగా చూపలేని
ప్రేమేనా…లేక అతింద్రియ శక్తులచే నన్ను
ఆవరించనున్న క్షుద్రమా…లేక గతజన్మల
అన్యోన్యాలు వాసనలై…మరువని
మమకారంతో వెంటాడుతున్న ప్రేతాత్మనా
తన విశ్వాసం కనిపించక పోయినా…
ఆలోచిస్తే మనస్సున గగుర్భటు మానసిక
భయమై గుప్పెడు గుండెను
చిదిమేస్తుంది…..
ఏమిటని ధైర్యం పురమాయించిన
మనిషిగా…బలగం లేక పోయినా ఆయుధం
లేని చేతులకు అడుగులు అస్త్రమై తగులు
తుందని తెలిసినా….అనుకూలత కొద్ది
దొరికిన టార్చ్ లైట్ ను చీకటిలోకి ఉద్దేశం
కనిపించాలని…ముందరికి వేస్తూ ఎవరని
పిలిచాను….సాగిన నడకలకు తెలిసింది
ఏమీలేదని….మరి ఏంటిదీ…?
దైవమా….దెయ్యమా….? నన్ను
మరులుగొల్పే ఆచ్ఛాదనమా…చీకటి
మడుగున ఆలోచనలు బళ్ళాలై
గుచ్చుతున్నవి…

అయినా సరే….
అన్వేషణని నిలుపరాదని నైతికను
లోపం కానీయక పిలుస్తున్నా….భయంతో
ఎవరు మీరని….ఏమిటా పిలుపని…
ఏకాంతం దోహదమవుతు పగలబడి నవ్విన
నవ్వు వినిపిస్తున్నది…ఆ నవ్వుకు అర్థం
ప్రతీకారం కోసమేననేదిగా తలపిస్తున్నది
గంభీర గమనింపుతో….
మాటిచ్చి బాసచేశావు దాగుడు మూతలతో
ఒలకరించిన ప్రేమను తాపావు…
ముద్దు మురిపాలతో అవని అందాలదాక
వెళ్ళొచ్చాము…
మనువాడే సమయానికి పేదరికం అడ్డొచ్చి
కాసుల రంగంలో కనకమేడలపై
తిరగాడుతు పేదింటి భరణం బోణికాలేదని….
నా బతుకును కాల రాసావు…
న్యాయమేనా…
ఏరుదాటాక తెప్పను తగలేస్తు అవసరం
తీరాక అఘాయిత్యమే శరణమని…
తనకంట కన్నీరు కార్చినా కసాయి
వాదంతో పీక పిసికేసిన పెద్దరికం
పేదవారి ప్రేమను బతికించలేదని…
తల వంచిన నీకు గుణపాఠం చెప్పుటకు
తన బతుకొక త్యాగం విసిరిన ప్రేతాత్మనై
ప్రతి జన్మలో పేద ప్రేమని బతికించాలని…
వంచనకు తావుండరాదని నిన్ను
వెంటాడుతున్న….ప్రియా….

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *