విశ్వశాంతి

విశ్వశాంతి

బ్రాహ్మణ ఇంటి బిడ్డ వై
మేన బావకి ఆలివై
కనికరం లేని మానవ
మృగాల బారిన పడి
పడరాని కష్టాలు పడుతూ పుట్టినిల్లు చేరి
మగ బిడ్డకు జన్మనిచ్చి
అల్లారు ముద్దుగా పెంచుకుంటూ

తనపై ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రయోజకుడ్ని

చేయాలనే సంకల్పించుకొని
ఒకప్పటి జీవిత చేదు ఎదగాయాలను మరవడానికి

ప్రయత్నిస్తూ ముళ్ళ బాటను పూలబాటగా మలుచుకుంటూ

తోబుట్టువుల ఆలోచన సరళిలో మమేకమై

పుట్టింటి పని భారాన్ని భుజాన వేసుకుని
కన్నతల్లి అనారోగ్య సమస్యను
ఒక్కదానివే భుజాన వేసుకొని
పసి పిల్లఓలే సేవలు చేస్తుంటే..!!
కనికరం లేని ఆ కన్నతల్లి ప్రేమ కూడా పోనీలే మా అమ్మే కదా..!!
నన్ను అనకపోతే ఎవరిని అంటుంది అని నీకు నీవు
సర్ది చెప్పుకుంటూ కంటి దారను దిగమింగుకుంటూ
చెప్పుకోలేని బాధలు ఎన్నింటినో మింగలేక కక్కలేక
నరక యాతన పడుతూ కూడా
చదువుకున్న చదువు వృధా పోకుండా

చదువుతూ తెలుగు భాషకు సేవ చేయాలనే

సంకల్ప ధ్యేయంతో అక్షర లిపి సమూహం

అనే మహా సంస్థానాన్ని స్థాపించి ఎంతో మంది రచయితలకు

కవులకు ఈ సంస్థానమున వారి రచనలను రచించి లిపి

ఖజానాలో దాచిపెట్టుకునే అవకాశం కల్పిస్తూ

కొత్తవారు పాతవారు అనే తేడా లేకుండా
అందరిని ఆదరించి హక్కున చేర్చుకుంటూ

ఎవరిని బాధ పెట్టకుండా తప్పొప్పులను సరి చేస్తూ అం

దరూ మనవారే అంటావు ఈ కుటుంబం మీది

ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అంటూ వారి ఇష్టానికి వదిలేస్తావు..!!
కన్ను తెరవగానే శుభోదయం మిత్రులారా

అని తియ్యగా పలకరించే నేస్తాన్ని ఎవరైనా వదిలి వెళ్ళిపోతారా..?
ఆ పిలుపులోనే ఒక తియ్యనైన కమ్మదనం

ప్రేమ మమకార మాధుర్యం నీలో మనశ్శాంతి

లేకపోయినా విశ్వశాంతి శ్రేయస్సు కోసం నీదైన శైలిలో
ఎందరో కళాకారులకు చేయూతనిస్తూ తెలుగు భాష శ్రేయస్సుకు పాటుపడుతున్న
ఓ విశ్వశాంతి నీ ప్రజ్ఞాపాటవములను ఎంత పొగిడినా తక్కువే🙏🙏
ఆడది అంటే అబల కాదు
ఏదైనా చెయ్యగలదు సాధించగలదు అని నిరూపించావు.💐💐👍
ఓ విశ్వశాంతి నీకు నీవే సాటి🫡🫡
నీవు అనుకున్న లక్ష్యం చేరుకోవాలని మనసారా దీవిస్తూ🤗🤗

నీ స్నేహ తోబుట్టువు ❤️🤝
*********

-బేతి మాధవి లత

0 Replies to “విశ్వశాంతి”

  1. అద్భుతం అండి చాలా చాలా బాగా రాసారు… 👌👌👌👌👌👌👌👌
    ఆడవాళ్లు అనుకుంటే ఏదేనా సాధించగలరు అని ఈ అక్షరలిపి ద్వారా స్పష్టంగా తెలుస్తుంది…
    సూపర్ 👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *